అంటార్కటికా అనగానే మనకు అత్యంత చలి వాతావరణం గుర్తుకు వస్తుంది. అక్కడ వాతావరణం మైనస్ డిగ్రీలలో ఉంటుంది. అయితే పెరుగుతున్న భూతాపం కారణంగా అంటార్కటికా ఖండం కూడా వేడెక్కుతుంది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అంటార్కటికా ఖండం ఎందుకు అంత చల్లగా ఉంటుంది…? అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత నమోదు అవుతుంది…?
Also Read:అగ్నిపథ్ పై రాజకీయ ప్రకంపనలు..
సూర్యుడి రేడియేషన్ మన భూమధ్యరేఖతో పోలిస్తే ఉత్తర ద్రవం మీద దక్షణ ద్రవం మీద చాల తక్కువగా అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రధాన కారణం… కారణం మన భూమి సుమారు 23.5 డిగ్రీలు వాలి ఉండడమే. దీనితో సూర్య కిరణాలు నేరుగా ఉత్తర ధృవం అలాగే దక్షిణ ధృవం మీద పడటానికి ఆస్కారం ఉండదు. అందుకే అక్కడ చాలా చల్లగా, మైనస్ డిగ్రీలు నమోదు అవుతాయి.
మంచు సూర్యుడి రేడియేషన్ ను తిరిగి అంతరిక్షం లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. దీన్ని అల్బెడో ఎఫెక్ట్ అని పిలుస్తారు. అది మంచు సహజ లక్షణం. అంటార్కిటికాలో మంచు ఎక్కువగా ఉండడంతో… ఉన్న కొద్ది సూర్యుడి యొక్క రేడియేషన్ తిరిగి అంతరిక్షం లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇదే అక్కడ అత్యంత చల్లగా ఉండటానికి ప్రధాన కారణం. అంటార్కిటికాలో మేఘాలు చాల తక్కువ. సాధారణంగా మేఘాలు ఉంటే… రాత్రి కొంత భూమి ఉపరితలం లో ఉన్న వేడిని తిరిగి అంతరిక్షంలోకి వెళ్లకుండా సహకరిస్తాయి. అంటార్కిటికాలో ఎక్కువ మేఘాలు లేకపోవడంతో వాతావరణం చల్లగా ఉంటుంది.
ఇప్పటి వరకు అంటార్కిటికాలో అతి తక్కువగా నమోదు అయినా ఉష్ణోగ్రత -83 డిగ్రీలు, అతి ఎక్కువ -12 డిగ్రీలు. చివరిగా సముద్రం భూమధ్యరేఖ లో ఉన్న వేడిని ఉత్తర మరియు దక్షణ ద్రవాలకు రవాణా చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని సైంటిఫిక్ కారణాలతో… ఉత్తర ద్రవం తో పోలిస్తే దక్షణ ద్రవం లో ఉన్న అంటార్కిటికాకు సముద్రం తక్కువ వేడిని రవాణా చేస్తుంది.
Also Read:పెళ్లి చేసుకుంటానని రాకుండా హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యే..