ఈ రోజుల్లో పక్షవాతానికి సంబంధించిన కేసులు పదే పదే పెరుగుతున్నాయి. మనిషి జీవన శైలి మార్పులతో పాటుగా అనేక అంశాలు దీని మీద ప్రభావం చూపిస్తున్నాయి. అనవసర విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం దీనికి ప్రధాన కారణంగా మానసిక వైద్యులు చెప్తున్నారు. ఇక పని ఒత్తిడి తో పాటుగా సరైన జీవన విధానం లేకపోవడం పక్షవాతానికి కారణం అంటున్నారు.
Also Read: పానీపూరి తింటున్నారా..? మీకో బ్యాడ్ న్యూస్
అయితే ఒకే మనిషికి ఎక్కువ సార్లు పక్షవాతం రావడం అనేది జరుగుతుంది. అలా జరగడానికి కారణం ఏంటో చూద్దాం. పక్షవాతం అనేది రక్త పోటు కారణంగా వస్తుంది. మనకు ఏ సందర్భంలో బీపీ పెరుగుతోంది అనేది గమనించాలి ముందు. అలాగే సూర్యతాపానికి, నీళ్ళు తక్కువగా తీసుకోవడం, ఉప్పు-కారాలు ఎక్కువగా తీసుకోవడం, నూనె-మసాలాలు అతిగా వాడటం కూడా దీనికి కారణం అవుతుంది.
అలాగే ఇంట్లో తరచూ చికాకులు ఉండటం కూడా దీనికి కారణం. గతంలో జరిగిన వాటికి అతిగా బాధపడుతూ ఉండటం లాంటివి బీపీని పెంచే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయట పడటానికి… పొటాషియం ఎక్కువగా ఉండే కొబ్బరి నీళ్లు, బార్లీ లాంటివి తీసుకోవడం, మంచి నీళ్లు ఎక్కువగా తాగి ఎంత మూత్రవిసర్జన చేస్తే అంత మంచిది అని వైద్యులు చెప్తున్నారు. అలాగే వేళకు భోజనం, డాక్టర్లు చెప్పిన మందులు చెప్పినట్లు వాడటం, కాసేపు వాకింగ్, మెడిటేషన్ ఖచ్చితంగా పాటిస్తే బీపీ అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. పక్షవాతం కూడా అదుపులోకి వచ్చే సూచనలు ఉంటాయి.
Also Read: పంచెతో ప్రిన్సిపల్… జీతం కట్ చేసిన కలెక్టర్