ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో అయినా నటించాలి అని ఎదురు చూసే నటులు చాలా మందే ఉన్నారు. సీనియర్ నటులు కూడా ఆయన సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం రాజమౌళి సినిమాలకు దూరంగా ఉన్నారు. మరి ఆయన దూరం పెట్టారో ఈయన పెడుతున్నారో లేదా ఇగో క్లాష్ అనేది తెలియదు.
కాని ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటి వరకు రాజమౌళి సినిమాల్లో కనపడలేదు. విక్రమార్కుడు సినిమాలో మాత్రం ఆయన పాత్ర ఒక అయిదు నిమిషాలు ఉంటుంది. అగ్ర నటుడిగా ఉన్నా సరే ఆయనను రాజమౌళి తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇదే విషయాన్ని రాజమౌళిని అడిగితే ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు చేయని పాత్ర లేదు అని అన్నారు. అలాగే ఆయన్ని మనం అన్ని పాత్రల్లో చూశాం అని చెప్తూ ఆసక్తికర విషయం చెప్పారు.
ఆయన మళ్ళీ నా సినిమాలో కూడా అదే రకం పాత్ర వేస్తే చూసే జనానికి బోర్ కొడుతుంది అన్నారు. ఆయన ఇంతవరకు చేయని పాత్ర ఏదైనా నా సినిమాలో వచ్చినప్పుడు నేనే ఆయనతో నా సినిమాలో చేయించుకుంటా అని ఒక క్లారిటీ ఇచ్చారు. కాగా రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కి వెళ్తుంది. వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.