మాములుగా స్టార్ హీరోలతో దర్శకులు సినిమాలు చేస్తే అవి హిట్ కొడితే వాళ్లకు మంచి పేరు వస్తుంది. దీనితో వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొందరు దర్శకులకు మాత్రం స్టార్ హీరోలతో అవకాశం వచ్చినా హిట్ కొట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ తర్వాత హిట్ లు కొట్టినా సరైన గుర్తింపు లేక కెరీర్ లో వెనకడుగు వేస్తూ ఉంటారు.
ప్రస్తుతం సంపత్ నంది అలాగే ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పాలి. రెండో సినిమానే రామ్ చరణ్ తో చేసారు. ఆ సినిమా అనుకున్న విధంగా హిట్ కాలేదు. మొదటి సినిమా మంచి హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత రవి తేజా తో చేసి హిట్ లు కొట్టాడు ఈ దర్శకుడు. రవితేజ తో తీసిన బెంగాల్ టైగర్,గోపిచంద్ తో తీసిన గౌతమ్ నంద సినిమాలు పర్వాలేదు అనిపించాయి. ఆ సినిమాల్లో హీరోలను బాగా చూపించాడు.
అయినా సరే కెరీర్ లో మాత్రం మంచి సినిమా చేయలేకపోతున్నారు అనే చెప్పాలి. ఆయన తర్వాత దర్శకులుగా మారిన కొరటాల శివ, అనీల్ రావిపూడి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తున్నారు. అగ్ర హీరోలు వారి కోసం ఎదురు చూసే పరిస్థితి. అయినా సంపత్ నంది మాత్రం సరైన హిట్ కొట్టలేకపోతున్నారు. త్వరలోనే రామ్ చరణ్ తో మరో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాని అద్రుష్టం మాత్రం కలిసి రావడం లేదు.