ఆర్ఆర్ఆర్ టీం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ సినిమాకు ఆస్కార్ రావడంతో నిర్మాత నుంచి కింది స్థాయిలో పని చేసిన వారి వరకూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ మొత్తం ఇప్పుడు అమెరికాలోనే ఉంది. ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న టీం త్వరలోనే తిరిగి రానున్నారు. ఇక ఈ సందర్భంగా వాళ్ళు ధరించిన డ్రెస్ గురించి కాస్త ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఇక ఇక్కడ ఎన్టీఆర్ మన తెలుగు నుంచి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నాడు. ఇదిలా ఉంచితే… ఇక్కడ ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్ గురించి మీడియాలో కూడా పెద్ద చర్చే జరిగింది. అసలు ఏంటి ఆ మేటర్ అనేది చూస్తే… ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్ మీద పులి బొమ్మ ఉంటుంది. ఇది బాగా వైరల్ అయింది ఇప్పుడు.
దీనిపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా… భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాను ఈ వస్త్రధారణలో వచ్చానని వివరించాడు. ‘ఆర్ఆర్ఆర్’లో తనతో కలసి దూకిన పులి ఇదేన అంటూ సరదాగా కామెంట్ చేసాడు. ఇక భారత జాతీయ జంతువు కూడా పులే అని అన్నాడు ఎన్టీఆర్. కాగా ఈ ఆస్కార్ వేడుకల్లో మొదటి సారి ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.