మన దేశంలో ఎక్కువగా మూడనమ్మకాలకు దెయ్యాలకు జనాలు భయపడుతూ ఉంటారు. దైవ భక్తి ఎక్కువగా ఉన్నా, విజ్ఞానం ఉన్నా సరే ఇలాంటి విషయాల మీద జనాలకు ఉండే భయం ఆసక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు కాస్త ఆందోళన కూడా పెంచుతున్నాయి. దెయ్యాల పేరుతో చిన్న పిల్లలను పైకి పంపిస్తున్నారు తల్లి తండ్రులు అనే మాట వాస్తవం.
ఇక దెయ్యాల సినిమాలు వచ్చాయి అంటే చాలు పక్కన ఎవరూ లేకుండా చూసే సాహసం కూడా చేయరు చాలా మంది. స్టార్ దర్శకుల నుంచి అలాంటి సినిమాలు వచ్చాయి అంటే చెమటలు పట్టినట్టే. ఇలా రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసాయి. అందులో ఒకటి బూత్ సినిమా. ఈ సినిమా ఆరు కోట్ల బడ్జెట్ తో వచ్చి సూపర్ హిట్ అయింది. అజయ్ దేవగన్, ఊర్మిళ ఈ సినిమాలో నటించారు.
ఈ సినిమాను ముంబై లో షూట్ చేసారు. వీర్ దేశాయ్ అనే రోడ్ లో ఈ సినిమాను షూట్ చేసారు. ఇక అప్పటి నుంచి ఆ షూట్ చేసిన అపార్ట్మెంట్ వైపు కూడా జనాలు చూడాలి అంటే భయపడుతున్నారు. 2003 లో ఈ సినిమా రాగా అప్పటి నుంచి ఆ అపార్ట్మెంట్ ఖాళీగానే ఉండిపోయింది. అమ్మడానికి గాని, అద్దెకు గాని ఎవరూ రావడం లేదు. దీనితో అపార్ట్మెంట్ యజమాని వదిలేసారు.