మన దేశంలో వివాహ వ్యవస్థ అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళను కొందరు ఇబ్బందికరంగా చేసుకుంటున్నారు గాని గతంలో మాత్రం వివాహాలకు ఒక పద్ధతి ఉండేది. అనేక రకాల ఆచారాలను పాటిస్తూ ఉండే వారు. అయితే ఈ మధ్య ఆచారాల సంగతి పక్కన పెడితే తల్లి తండ్రులు కూడా పెళ్ళికి వస్తారా లేదా అనేది గ్యారెంటి లేదు.
Also Read:రెచ్చిపోయిన గొలుసు దొంగలు
అది అలా ఉంచితే… పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకు రావడం అనే ఆచారం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. అసలు అలా ఎందుకు చేస్తారు అనేది చూద్దాం. పూర్వం రాజుల కాలంలో కొందరు వెదవలు పెళ్లి కాని ఆడపిల్లలను అపహరించుకుని పోయి… వాళ్ళను చాలా నీచంగా చూసే వారు. ఆ సమయంలో పెళ్లి చేయాలి అంటే ఒకరకంగా భయం ఉండేది. పెద్ద మనిషి అయిన పిల్లలను ఎక్కువగా ఎత్తుకు పోవడం జరిగేది.
కాబట్టి పెళ్లి చేసే సమయంలో ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా పెళ్లి పీటల వరకు తీసుకు రావాల్సి ఉంటుంది. పెళ్లి కూతురుగాని వారి కుటుంబం గాని క్షేమంగా ఉండాలి అని కోరుకునేది ఎవరు…? ఆ వరుసలో ముందు మేనమామ వస్తారు. తల్లి తండ్రుల తర్వాత ఆడపిల్లకు ఆయనే రక్షణ. అందుకే పెళ్ళికి సంబంధించి మేనమామల సహకారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
అందుకే మేనమామ లేదా మామలు తమ మేనకోడలి రక్షణ బాధ్యతను తీసుకుని కాపాడుకుంటారు. అలా ఆమెను పెళ్లి పీటల వరకు తీసుకు రావడం జరుగుతుంది. అయితే అమ్మాయికి మేనమామలు లేకపోయినా పెళ్లి కూతురు తల్లి కి సోదర సమానులు విధిగా ఈ కార్యక్రమంలో భాగం అవుతారు. అయితే పెళ్లిళ్లకు సంబంధించి తమకు నచ్చినట్టుగా జరగడం లేదని మేనమామలు దూరంగా ఉండటం, అలగడం వంటివి జరుగుతున్నాయి. అమ్మాయి తల్లి తండ్రులు తన మాటను పక్కన పెట్టినా వివాహాల్లో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు.