విదేశాల్లో పిల్లికి ఇన్ని కోట్ల ఆస్తి రాసారు అన్ని కోట్ల ఆస్తి రాసారు అని మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. కాని మన దేశంలో పిల్లి గురించి ఇలాంటివి ఎక్కడా వినపడవు. మన దేశంలో ఎక్కడ చూసినా సరే కుక్క గురించి మాత్రమే వార్తలు చూస్తాం. అసలు మన దేశంలో కుక్కలకు అంత డిమాండ్ ఎందుకు ఉంటుంది…? ఈ స్టోరీ లో చూద్దాం.
Also Read:రోదసి యాత్ర విజయవంతం.. కమాండర్‌గా తెలుగు సంతతి వ్యోమగామి
మన గొంతుతో ఇచ్చే ఆదేశాలను పాటించడంలో కుక్కలు ఎక్కడా ఇబ్బంది పడవు. పిల్లికి ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచినా సరే… తననే పిలిచాం అని పిల్లికి అర్ధం కాదు. ఇక కుక్కలు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. కాని పిల్లికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. అవి రోజులో ఎక్కువ భాగం నిద్రకే కేటాయిస్తూ ఉంటాయి. కుక్క మనం వాకింగ్ కి వెళ్ళినా బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే రావడానికి ఆసక్తి చూపిస్తుంది.
ఇక కుక్క… మనల్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుంది. కాపలా విషయంలో కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తుంది. కాని పిల్లి మాత్రం కొత్త వాళ్ళను చూస్తే భయపడుతుంది. మన దేశంలో రక్షణకు, కాపలాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి కుక్కకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కుక్కలకు ట్రైనర్స్ తేలికగా దొరుకుతారు కానీ పిల్లులకు ఈ శిక్షణ చాలా కష్టంగా ఉంటుంది. కుక్కలు మనలను సంతోష పరచేందుకు ప్రయత్నం చేస్తే ,పిల్లులు రాజసంగా మీ ప్రేమను హక్కులా భావిస్తాయి.
.కుక్కలు దాదాపు 165 పదాలు నేర్చుకోగలవు. పిల్లులు అతికష్టం మీద 35 పదాలు మాత్రమె నేర్చుకునే అవకాశం ఉంటుంది. పిల్లులు రోజు మొత్తంలో 80 శాతం పడుకునే ఉంటాయి. కుక్కలకు ఎక్కువ నిద్ర నచ్చదు. ఇక కుక్కలు ఎన్నో ఆకారాల్లో ఉంటాయి. పిల్లి ఒకే ఆకారంలో ఉంటుంది. పిల్లికి ప్రాణ భయం ఎక్కువగా ఉంటుంది. తన కంటే ఏదైనా పెద్ద జంతువు కనపడితే తన రక్షణకు ప్రాధాన్యత ఇస్తే కుక్క వాటి మీద పోరాడే ప్రయత్నం చేస్తుంది. విదేశాల్లో పిల్లిని అందమైన జంతువుగా మాత్రమే చూస్తారు.
Also Read:ప్రహరీ కూలింది.. నష్టం జరిగింది..!