మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సాంప్రదాయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి సంప్రదాయమే అమ్మాయి మొదటి కాన్పు పుట్టింట్లో జరగడం. భర్తకు బాధ్యత ఉన్నా సరే… పుట్టింట్లో కాన్పు జరుగుతుంది. దానికి గల కారణం ఏంటో చూద్దాం. చాలా వరకు… గతంలో పురిట్లోనే మాతాశిశు మరణాలు ఉండేవి. అత్తింటివారు సరైన శ్రద్ధ తీసుకోకపోతే గనుక అమ్మాయి ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది.
Also Read:చికోటి చీకటి వ్యాపారం.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు
అమ్మాయి అవసరాలు తెలుసుకోకుండా మూర్ఖత్వంగా వ్యవహరించే అత్తలు ఉండే వాళ్ళు. అన్నీ బాగున్నా సరే పెళ్ళాన్ని చంపి మళ్ళీ కట్నం తీసుకుని ఇంకో అమ్మాయి ని పెళ్లి చేసుకునే మనుషులు ఉండే వాళ్ళు. కాబట్టి ఏ విధమైన అనుమానాలు లేకుండా ఉండటానికి పుట్టింటి వారు తీసుకుని వెళ్ళి పురుడు పోసిన మూడో నెల లో లేదా ఐదోనెలలో తిరిగి అత్త వారింటికి పంపుతారు.
మొదటి రెండు పురుళ్ళు పోయడం మన తెలుగు నాట సాంప్రదాయంగా ఉంది. మాతా శిశు క్షేమం గురించి మాత్రమె ఈ విధంగా చేసే వాళ్ళు. ఇక మరో కారణం కూడా ఉంది. కొడుకులు లేనివారికి కూతురి కొడుకు తమ సొంత కొడుకుతో సమానంగా చూసే వాళ్ళు. అమ్మమ్మ, తాతయ్య ల అంత్యక్రియల బాధ్యత అతనే తీసుకునే వాడు. ఇది కూడా ఒక కారణం అని చెప్తారు.
అయితే ఉత్తరాదిలో మొదటి కాన్పు మాత్రం అత్తగారి ఇంట్లో జరుగుతుంది. ఇక మరో కారణం ఏంటీ అంటే… అమ్మాయి అవసరాలు, ఆమె తినే ఆహారం, ఆరోగ్య పరిస్థితి, ఆమె ఫ్రీగా షేర్ చేసుకునే విషయాలు ఎక్కువగా తల్లితోనే ఉంటాయి. మానసికంగా కూడా అత్తగారి కంటేతల్లి కలిగించే ధైర్యం ఎక్కువ. అందుకే కాన్పు అత్తగారి ఇంట్లో జరుపుతారు.