ఎవరెన్ని చెప్పినా సరే ఇది కంప్యూటర్ యుగం అనే మాట వాస్తవం. కంప్యూటర్ లేకుండా మన జీవితం నడిచే అవకాశం లేదు. వ్యాపార, ఉద్యోగ, కుటుంబ, విద్య, వినోద ఇలా ఏ రంగం చూసినా సరే కంప్యూటర్ మన మీద బలమైన ముద్ర వేసింది. ఇక కంప్యూటర్ కి సంబంధించి ప్రతీ విషయం కూడా మనకు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక కంప్యూటర్ లో ఆసక్తికర విషయం ఏంటీ అంటే…
Also Read:ఆ పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ
మౌస్ కర్సర్ వంకరగా ఎందుకు ఉంటుంది…? ఈ విషయం చాలా మందికి తెలియదు. కంప్యూటర్ మౌస్ ని కనుక్కొన్నది జెరాక్స్ కంపెనీకి చెందిన ఇంజనీరు డగ్లస్ ఎంగెల్‌బార్ట్. దీన్ని 1981 లో ఆయన కనుక్కున్నాడు. ఆయన తయారు చేసిన సమయంలో దాన్ని నిలువు గీత లాగే డిజైన్ చేయడం జరిగింది. కానీ మొదట్లో డిజిటల్ డిస్ ప్లే అంత ఎక్కవ రిజల్యూషన్ తో ఉండేది కాకపోవడంతో సమస్యలు వచ్చేవి.
అలాంటి తెరలపైన అది కనిపించీ కనిపించనట్లు ఉండటం జరిగేది. తెర మీద అది ఎక్కడుందో వెతుక్కోవలసి వచ్చేది. ఆ సమస్యతో సమయం వృధా అయ్యేది బాగా. దానికి పరిష్కారంగా నిలువుగా కాకుండా 45 డిగ్రీలు ఎడమవైపుకు వంచడంతో ఇక అప్పటి నుంచీ అది అలా స్థిరపడిపోయింది. ఇప్పటి తెరలమీదకు అంతగా అవసరం లేకపోయినా అందరికి అలా అలవాటు అయిపోయింది.
Also Read:పెరుగుతున్న కరోనా కేసులు… సీఎంలతో మోడీ కీలక సమావేశం