మనం చిన్నప్పటి చదువుకున్నది, చూసింది ఏంటీ అంటే… నీటికి రంగు, రుచి, వాసన ఉండదు అని. ఈ మధ్య కాలంలో అన్నీ కనపడుతున్నాయి గాని స్వచ్చమైన నీటికి అయితే ఇవేమీ ఉండవు. ఇక నీళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి రుచిలో కాస్తో కూస్తో మార్పులు ఉంటాయి. అయితే నీటికి ఏ రంగు ఉండనప్పుడు సముద్రంలో ఉండే నీళ్ళు ఎందుకు నీలం రంగులో కనపడతాయి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
Also Read:రోజూ వేడి నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది…?
సముద్రపు నీరు నీలంగా కనిపించటానికి చాలా కారణాలు ఉన్నాయి. సూర్యుని కాంతి ప్రధానంగా ఏడు రంగుల మిశ్రమం. చిన్నప్పుడు స్కూల్ లో కూడా ఈ విషయం చెప్తారు. ఈ కాంతి నేరుగా సముద్రంపై పడినప్పుడు నీటి అణువులు ఆ కాంతిని వెదజల్లడం జరుగుతుంది. దీన్నే పరిక్షేపం అని పిలుస్తారు. ఈ విధంగా వెదజల్లే క్రమంలో సూర్యకాంతిలోని ఇతర రంగుల కన్నా నీలం రంగు ఎక్కువగా పరిక్షేపమవుతుంది.
అలాగే… రసాయనిక బంధాల పరంగా చూస్తే నీరు దృశ్యకాంతిని తీసుకునే అవకాశం లేదు. సాధారణ నీరు వర్ణరహితంగా, పారదర్శకంగా కనపడుతుంది. ఇక నీటి అణువులు కాంతిని శోషించుకోలేవు కాబట్టి బయటకు పంపిస్తాయి. ఆ ప్రక్రియలో ఎక్కువగా నీలం రంగు బయటకు వచ్చేస్తుంది. ఇక మన కన్ను విషయానికి వస్తే… సూటిగా వెళ్లే కాంతి కన్నా అన్ని వైపులకూ వెదజల్లిన కాంతిని ఎక్కువగా గుర్తిస్తుంది. నీలంగా కనిపించే ఆకాశాన్ని నీరు ఒక అద్దంలా ప్రతిబింబించడంతో సముద్రంలో ఉండే నీరు నీలం రంగులో కనపడుతుంది.
Also Read:ఏపీ నెంబర్ వన్ ద్రోహి బీజేపీ..!