బండ్ల గణేష్” కమెడియన్ నుంచి నిర్మాతగా మారిన ఒక బడా వ్యాపారవేత్త. ఆయన వ్యాపారాల్లో సినిమా నిర్మాణం మాత్రమే జనాలకు తెలుసు గాని… ఆయన మాత్రం ఎప్పుడూ ఏదోక రూపంలో వార్తల్లో ఉంటారు. స్టార్ హీరోల సినిమాల్లో కామెడి పాత్రలు పోషించిన బండ్ల ఆ తర్వాత ఒక వెలుగు వెలిగారు. నిర్మాతగా అగ్ర హీరోలతో సినిమాలు చేసారు. నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలను లైన్ లో పెట్టేసారు.
Also Read:ప్రధాని మోడీ శాలువాపై టీఆర్ఎస్ నేతల విసుర్లు….!
చిన్నా చితకా పాత్రలు పోషించిన ఆయనకు గబ్బర్ సింగ్ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత బండ్ల నిర్మాణ రంగం మీద ఫోకస్ చేసి మంచి సినిమాలే చేసినా ఆ తర్వాత టెంపర్ సినిమాతో ఆగిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఎందుకు సినిమాలు చేయలేదో తెలియదు గాని ఎన్టీఆర్ తో మాత్రం విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండేవి అని అన్నారు. ఎన్టీఆర్ మాట వింటే ఆయన కాస్త ఇబ్బంది పడేవారు.
ఈ విషయంపై బండ్ల క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్టీఆర్ విషయంలో మిస్ కమ్యూనికేషన్ వల్ల పొరపాటు పడ్డానని.. ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్తున్నానని అన్నారు. భార్యభర్తలు, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గ్యాప్ ఉంటుందన్న బండ్ల… ఎన్టీఆర్‌తో ఓ మిస్ కమ్యూనికేషన్ వల్ల చిన్న డిస్కర్షన్ జరిగిందని పేర్కొన్నాడు. అంతేకాని తమ ఇద్దరి మధ్య ఏం గొడవలు లేవని క్లియర్ గా చెప్పేసాడు.
Also Read:సభలో కళ్లు తిరిగి పడిపోయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి