మన దేశంలో నిత్యం ఎక్కడ చూసినా సరే ఏదో ఒక చోట పవర్ కట్స్ ఏర్పడుతూనే ఉంటాయి. కరెంటు ఎక్కడో ఒక చోట పోతూనే ఉంటుంది. ఇక ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు.. అంటే తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు అయితే కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో అసలే తెలియదు. అయితే మన దేశంలో పవర్ కట్స్ ఉంటున్నాయి కదా.. మరి అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పవర్ కట్స్ ఉంటాయా ? అంటే..
అవును.. ఉంటాయి. కాకపోతే మన దగ్గరిలా కాదు. మరీ తీవ్రమైన ఉత్పాతాలు ఏర్పడినప్పుడు, సప్లైకి, డిమాండ్ కు మధ్య భారీ వ్యత్యాసం వచ్చినప్పుడు, సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే అమెరికా వంటి దేశాల్లో కరెంటు పోతుంటుంది. అయితే ఇలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందువల్ల అక్కడ పవర్ కట్స్ దాదాపుగా ఉండవనే చెప్పవచ్చు. ఇక అమెరికాలో 120వి/60హెడ్జ్ లో వోల్టేజ్ కరెంట్‌ని వాడుతారు. అందువల్ల అక్కడ సహజంగానే విద్యుత్ పరికరాలపై భారం తక్కువగా పడుతుంది. అందువల్ల అక్కడ కరెంటు పోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది.
ఇక మన దేశంలో పవర్ కట్స్‌కు అనేక కారణాలు ఉంటాయి. చిన్నపాటి గాలి వాన వచ్చినా కరెంటు పోతుంది. విద్యుత్ మౌలిక సదుపాయాలు, సామగ్రి, పరికరాలు పురాతనమైనవి కనుక వాటికి తరచూ మరమ్మత్తులు చేయాల్సి వస్తుంటుంది. దీనికి తోడు చెట్ల కొమ్మలను తొలగించాలని, ఇతరత్రా కారణాలు చెప్పి కరెంటు తీసేస్తుంటారు. అలాగే వేసవి లాంటి సమయాల్లో డిమాండ్ అధికమవుతుంటుంది. కానీ సప్లై తక్కువగా ఉంటుంది. అందువల్ల కరెంటు తీసేస్తారు. ఇక అమెరికాలా మన దగ్గర విద్యుత్ సరఫరాకు అధునాతన సదుపాయాలు లేవు. అందువల్లే కరెంటు మన దగ్గర తరచూ పోతుంది. అమెరికాలో కరెంటు పోదు. అంతే తేడా..!