బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయన హాలీవుడ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు మహేష్ బాబుతో మరో భారీ బడ్జెట్ సినిమాను రాజమౌళి ప్లాన్ చేసాడు. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. ఇక రాజమౌళి క్రేజ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మరింత పెరిగింది అనే చెప్పాలి.
ఆ సినిమా ఇప్పుడు ఆస్కార్ వద్ద కూడా సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా టీం మొత్తం అమెరికాలోనే ఉన్నారు. ఇదిలా ఉంచితే రాజమౌళి సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఉంటుంది. ఆయన సినిమా చివర్లో, సినిమా పోస్టర్ ల మీద ఒక స్టాంప్ ఉంటుంది. అసలు ఈ స్టాంప్ ఎందుకు అనేది ఒకసారి చూస్తే… తన సినిమాకు వచ్చినప్పుడు ఊళ్ళల్లో ఉన్న చదువు రాని వ్యక్తులకు ఆయన సినిమా పేర్లు అర్థంకావట.
అందుకే తాను తీసే సినిమాల పేర్లు చదువురాని వారికి కూడా అర్ధం కావాలి అని… అందుకే… మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టాంప్ ఆలోచన వచ్చి పెట్టినట్టు చెప్పాడు. అప్పుడు పేరు చదవరాకపోయిన కనీసం ఆ పోస్టర్ల మీద ఆ ముద్ర చూసి అయిన తన సినిమా అని గుర్తు పడతారు కదా అని… అలా గుర్తుపట్టి తన సినిమాకి వస్తారని అలా పోస్టర్ల మీద ముద్ర వేశామని ఆయన అసలు విషయం చెప్పారు.