గ్రామాల్లో జంతు బలి అనేది దశాబ్దాలుగా నడుస్తున్న ఒక ఆచారం. అసలు ఎందుకు జంతు బలి అనేది అంత ఫేమస్ అయింది…? నూకాలమ్మ, గంగమ్మ, పెద్దమ్మ మరిడమ్మ సత్తెమ్మ పైడి తల్లి, మైసమ్మ, ఎల్లమ్మ , పోచమ్మ వంటి దేవతలకు నైవేద్యంగా కోడినో, మేకనో సమర్పిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా మొక్కు కూడా ఉంటుంది. మన దేశ గ్రామీణ సంస్కృతిలో ప్రాముఖ్యమైనది జంతు బలి. కచ్చితంగా గ్రామాల్లో ఉండే నమ్మకం ప్రకారం చూస్తే… శక్తివంతమైనది గ్రామ దేవత.
Also Read:పాడ్ కాస్ట్ అంటే ఏంటీ…? పాడ్ కాస్ట్ లు వచ్చి ఎన్నేళ్ళు అయిందో తెలుసా…?
తమను ఆరోగ్య రీత్యా సదా కాపాడునని నమ్ముతూ ఉంటారు. ఈ గ్రామ దేవతలకు ఏ విధమైన ఆకారం ఉండదు. ఒక రాయినో చెట్టునో దేవతగా గుర్తించి… రాళ్లు , చెట్టు-పుట్టలు-గుట్టలు-గుహలలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. బ్రాహ్మణులు లేదా ఇతర అగ్ర కులం వారు వారి ఆర్ధిక పరిస్థితి ఆధారంగా పెద్ద పెద్ద పేరున్న దేవుళ్ళకు మొక్కులు ఇస్తే… గ్రామాల్లో ఉండే వారు… తక్కువ ఆచార వ్యవహారాలు ఉండే వాళ్ళు గ్రామ దేవతలకు పూజలు చేస్తారు.
ఈ గ్రామ దేవతకు ఆహార పదార్ధములతో పాటుగా… జంతు రక్తము తో సమర్పించి తమను కాపాడమని పూజా కార్యక్రమము నిర్వహిస్తారు. ఏదైనా కీడు ఉంటే, లేదా తమకు ఏదైనా దిష్టి తగిలితే ఆ జంతు బలి ద్వారా కీడు తొలగిపోవాలని, తమ కుటుంబం నుంచి దేవత రక్తాన్ని కోరినా సరే ఆ కోడి లేదా మేక ద్వారా అది తొలగిపోవాలని వారి నమ్మకం. ఈ గ్రామ దేవత ఆచారం ప్రాచీన గ్రీకులు, ఈజిప్ట్ లాంటి వారి వద్ద కూడా ఉంది. ఊరి పొలిమేరలో గ్రామ దేవతకు సంబంధించి చెట్టు లేదా రాయి ఉంటుంది. వివాహం కాని స్త్రీ దేవతను మాత్రమే గ్రామ దేవత అని అంటారు.
Advertisements
Also Read:ఫిక్సిడ్ డిపాజిట్ ముందే తీసుకుంటే బ్యాంకులు ఎందుకు చార్జీలు వేస్తాయి…?