దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత క్రమంగా తగ్గుతూ వచ్చింది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. పట్టణ ప్రాంతాల్లోనే కరోనా కేసుల గురించి చర్చ జరుగుతుంది గాని గ్రామీణ ప్రాంత ప్రజలు పూర్తిగా కరోనాను పక్కన పెట్టారు. మాస్కుల విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వ్యవసాయ పనులకు స్వేచ్చగా వెళ్తున్నారు.
Also Read:భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు… తాజాగా ఎంత పెంచారంటే?
అయితే కరోనా కేసుల విషయంలో ముందు నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలు దాదాపుగా కంగారు పడిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఇక మరణాల రేటు కూడా మొదటి వేవ్ లో రెండో వేవ్ లో గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగానే ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కరోనా రాకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఎండలోనే తిరుగుతూ ఉంటారు.
అదే విధంగా ఎండలో పనిచేయడం వలన డి విటమిన్ లోపం వాళ్ళల్లో పెద్దగా లేదనే చెప్పాలి. ఎప్పుడు పనిచేయడం వలన రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు వాతావరణం లో ఉన్న వైరస్ మరియు బాక్టీరియా లాంటి వాటితో శరీరం పోరాటం చేస్తుండడం కూడా వాళ్లకు కలిసి వచ్చిన అంశం. గ్రామాలలో జన సాంద్రత చాలా తక్కువగా ఉండడం వరంగా చెప్పాలి. కరోనా విషయంలో అనవసర ప్రచారాలు వాళ్ళు వినకపోవడం. అలసిపోయి బాగా నిద్రపోవడంతో రోగ నిరోధక శక్తి బలంగా చేయడం కూడా వాళ్లకు మేలు చేస్తుంది.
Also Read:దర్శనమిచ్చిన నెలవంక.. రంజాన్ మాసం ప్రారంభం