డాక్టర్ హత్యపై కేసీఆర్ మూడు రోజుల మౌనం ఎందుకు...? - Tolivelugu

డాక్టర్ హత్యపై కేసీఆర్ మూడు రోజుల మౌనం ఎందుకు…?

Why KCR Not Responding On Disha Incident : Congress Vijaya Shanthi, డాక్టర్ హత్యపై కేసీఆర్ మూడు రోజుల మౌనం ఎందుకు…?

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో గెలవగానే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన సీఎం కేసీఆర్, వెటర్నరీ డాక్టర్‌ హత్యపై 72గంటలు గడిచాక పెదవి విప్పటంపై కాంగ్రెస్‌ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. మానవ మృగాల చేతిలో అమానుషంగా అత్యాచారినికి గురై అమాయక ఆడబిడ్డ అసువులు బాసిన ఘటనపై స్పందించేందుకు మూడు రోజులు తీసుకున్నారని విజయశాంతి విమర్శించారు.

మంత్రి తలసాని పశువులా ప్రవర్తించారు: నాగం

అది కూడా మహిళా సంఘాలు నిలదీసిన తర్వాత, జాతీయ మీడియా ఏకిపారేసిన తర్వాత మొక్కుబడిగా ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారణ చేయిస్తామన్న ప్రకటనేదో… డాక్టర్ సజీవ దహనం ఘటన వెలుగులోకి రాగానే గానీ, వరంగల్‌లో మానస హత్యాచారానికి గురైన వెంటనే గానీ చేస్తే విలువ ఉండేదన్నారు.

రేప్ కేసు నిందితుడిని చితగ్గొట్టి… చేతులు తాళ్లతో కట్టి…నగ్నంగా..

ఎన్నో మాటలు చెప్తున్న సీఎం కేసీఆర్… డాక్టర్ కనిపించటం లేదని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. ఇలాంటి వాటితో పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రకటన కేవలం కంటితుడుపు చర్యగా అభివర్ణించారు విజయశాంతి.

తెలంగాణ న్యాయం… కెసిఆర్ న్యాయం

Share on facebook
Share on twitter
Share on whatsapp