నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్….. పర్యటన నిమిత్తం ఎక్కడికి వెళ్లినా తన వెంట ప్రత్యేకంగా తయారు చేయించిన టాయిలెట్ ను తీసుకెళుతుంటాడు. తను ప్రయాణించే ట్రైన్స్ లో అయితే ప్రత్యేక టాయిలెట్స్ ఉంటాయి. రైళ్లలోనే కాకుండా తాను ప్రయాణించే లగ్జరీ కార్లలో కూడా టాయిలెట్ ఉండేలా డిజైన్ చేయిస్తాడు కిమ్!
ఎందుకిలా? :
కిమ్ కు చాలా అనారోగ్య సమస్యలున్నాయి. కిమ్ యొక్క మల మూత్రాలను పరీక్షిస్తే అవేంటో తెలిసిపోతాయి. అందుకే ఆ అవకాశాన్ని ఇతరులకు ఇవ్వకుండా తన రోగాల గురించి బయట తెలియకుండా ఉండేందుకు తనకోసం ప్రత్యేకంగా తయారు చేసిన టాయిలెట్లను తన వెంట తీసుకెళుతుంటాడు కిమ్ .2018 లో సింగపూర్ సమ్మిట్ లో ట్రంప్ తో కలిసేందుకు వెళ్లినప్పుడు ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.