ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ నెం.2 స్థానం ఆయనది. ఆయన ఎం చేయాలనుకున్నా, ఎన్ని నిధులు కేటాయించాలనుకున్నా చిటికెలో పని. పైగా మంత్రి హోదాలో ఒక్కసారి మాత్రమే తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూశారు. ఇప్పుడిదే నియోజకవర్గంలో చర్చనీయాంశం అవుతోంది.
తన సొంత నియోజవకర్గం, పైగా కొత్త జిల్లా. ఇతర మంత్రులంతా తమ జిల్లా, నియోజకవర్గం అభివృద్ది కోసం నిత్యం కృషి చేస్తుంటే… కేటీఆర్ సిరిసిల్లవైపు కన్నెత్తి చూడటం లేదంటున్నారు సిరిసిల్ల ప్రజలు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె నేపథ్యంలో కేటీఆర్ జోక్యం చేసుకుంటే కేసీఆర్‌తో మాట్లాడతారని అంతా అంచనా వేసినా… కేటీఆర్ మాత్రం దీనిపై స్పందిచం లేదు.
ఉద్యోగ ఉపాధ్యాయ రెవెన్యూ సంఘాలన్నీ ఆర్టీసీ జెఎసీకి మద్దతిస్తున్నాయి. ఉద్యమాల పురిటి గడ్డ అయిన కరీంనగర్‌లో టీఆర్ఎస్ ఓనర్లలో ఒకరు ఈటెల కూడా సమ్మెపై నోరు మెదపటం లేదు. కేటీఆర్ కన్నెత్తి చూడటం లేదు. మరో మంత్రి గంగుల కమాలకర్ మాట్లాడితే ఉద్యమకారులు ఎవరూ సహించలేని పరిస్థితి ఉంటుంది. ఇక కొప్పులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
అయితే, ఎన్నికలకన్నా ముందే కేటీఆర్ సిరిసిల్లను వదిలేస్తారని, ఉప్పల్‌కు మారబోతున్నారని ప్రచారం సాగింది. కేటీఆర్ అనుచరవర్గం బాల్క సుమన్, మేయర్ బొంతు రామ్మోహన్ సీరీయస్‌గా ఉప్పల్‌పై దృష్టిపెట్టారు. గ్రౌండ్ వర్క్ చేసినా చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు.
కానీ అనూహ్యంగా ఎంపీ ఎన్నికల్లో సిరిసిల్లలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది. ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కు సిరిసిల్లలో మెజారిటి వచ్చింది. టీఆర్ఎస్‌కు లక్ష మెజారిటీ వస్తుందనుకున్నారు కేటీఆర్. కానీ అవేవి జరగ లేదు సరికదా… కరీంనగర్ లాంటి టీఆర్ఎస్ కంచుకోటను బీజేపి బద్దలు కొట్టగలిగింది. అనాటి నుండే కేటీఆర్‌కు జిల్లా మీద, సిరిసిల్ల మీద ఆసక్తి పోయిందని టీఆర్ఎస్ నేతలే ఒకటి రెండు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
అయితే, కేటీఆర్ అనుచరులు ఎప్పటికప్పుడు సిరిసిల్ల సమాచారాన్ని చేరవేస్తూ, మంచి చెడ్డలు చూస్తారని… సిరిసిల్ల కలెక్టర్‌తో కూడా కేటీఆర్ రెగ్యూలర్‌గా టచ్‌లో ఉంటాడంటున్నారు టీఆర్ఎస్ నేతలు.