దేశం కోసం అవసరమయితే సీఏఏకు సపోర్ట్ చేస్తామని, బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటేసినప్పటికీ సీఏఏ అమలు చేయాలా వద్దా అన్న అంశంపై సుదీర్ఘ చర్చ తర్వాతే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన అంశాన్ని ప్రముఖ జాతీయ పత్రిక హిందూ రాయటంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా పత్రిక కథనాన్ని రాసిందని, ఇతర మీడియా సంస్థలు మాత్రం నేను చెప్పిన అంశాలనే రాశారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. పత్రికా కథనాన్ని కూడా పోస్ట్ చేస్తూ… దీనికి పత్రిక సమాధానం చెప్పాలని, ఇలాంటి ప్రచారం చేయొద్దంటూ కోరారు.
అయితే, వార్త రాసిన ప్రముఖ జాతీయ పత్రిక హిందూ. ఇప్పటికీ ఎంతో విలువలతో వార్తను రాస్తారని… రాష్ట్రంలో ప్రముఖ మీడియా సంస్థలన్నీ టీఆర్ఎస్‌ను ప్రశ్నించే సహాసం చేయటం లేదని జర్నలిస్ట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి పత్రిక తప్పుడు వార్త రాసే అవకాశం ఉండదని… తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికే దాడి మొదలుపెట్టినట్లు భావిస్తున్నట్లు సీనీయర్ జర్నలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.