ఈ రోజుల్లో కాళ్ళు నొప్పులు, నడుం నొప్పులు అనేవి చిన్న వయసుల వారికే వచ్చేస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయట పడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ సమస్య తొలగిపోవడం లేదనే చెప్పాలి. చాలా మందికి పడుకునే ముందు కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా ఎందుకు వస్తాయనేది చాలా మందికి అవగాహన లేదు.
Also Read:తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా..
ఈ సమస్యను రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోం అని పిలుస్తారు. కొందరికి ఇది ఒక వింత సమస్య. సాయంత్రం, రాత్రి పూట కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఒక్కోసారి తొడలు కూడా నొప్పులు వస్తాయి. ఇది సరిగా డాక్టర్ కు కూడా చెప్పలేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది గాని అది నొప్పి అని చెప్పలేరు. పాదాలు, కాళ్ళు అదే పనిగా కదుపుతూ ఉండాలనే ఫీల్ ఉంటుంది. ఉదయం సమయంలో ఈ సమస్య ఉండదు. ఆ తర్వాత నిద్ర కూడా తక్కువగానే ఉంటుంది.
ఈ సమస్య ఎక్కువగా శరీర తత్వాన్ని ఆధారంగా వస్తుంది. ఏ వయసులో అయినా ఈ సమస్య వస్తుంది గాని 25 ఏళ్ళు దాటిన తర్వాత మరింత తీవ్రంగా ఉంటుంది. ఐరన్ లోపం కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇతర కారణాలు కూడా కొన్ని ఉంటాయి. ఉండవచ్చును. వీటిలో కొన్ని పెరిఫెరల్ న్యూరోపతి, పార్కిన్సన్ వ్యాధి, మూత్రపిండాల వైఫల్యం లాంటి సమస్యలతో కూడా వస్తాయి. డాక్టర్లు పరీక్ష చేసి ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి సమస్యకు తగిన విధంగా మందులు ఇస్తారు. ప్రత్యేక కారణం ఏమీ లేకపోతే ఉన్నాయేమోనని చూస్తారు. ఇనుము లోపం ఉంటే గనుక దానికి మందులు వాడిస్తారు. ప్రత్యేకించి కారణం ఏమీ కనపడకపోతే గబాపెంటిన్, రోపినిరోల్, ప్రమిపెక్సోల్, క్లోనాజెపం లాంటి మందులు వాడిస్తారు.
Also Read:సంజయ్ రౌత్ కు షాక్..!