టాలీవుడ్ లో సుకుమార్ సినిమా ఒకసారి చూస్తే అర్ధం కాదు అనే మాట ఉంటుంది. పుష్ప సినిమా మొదటి సారి చూసిన వాళ్లకు అర్ధం కాలేదు. సినిమాలో డెప్త్ అర్ధం చేసుకుని రెండోసారి చూసిన వాళ్ళు మూడో సారి కూడా చూసారు. ఆయన సినిమాల్లో కాన్సెప్ట్ పూర్తి భిన్నంగా ఉంటుంది. కాపీ కొట్టారు అనే పేరు కూడా ఎక్కడా రాదూ. ఇక ఆయన చేసిన వన్ నేనొక్కడినే అనే సినిమా దారుణ ఫ్లాప్ అనే పేరు తెచ్చుకుంది. ఎందుకు అసలు ఆ సినిమా ఫ్లాప్ అయింది…?
మొదటి కారణం: ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు అంత ఈజీగా అర్ధం కాలేదు. సబ్జెక్ట్ ఉన్న వాడికి మాత్రమే అర్ధమయ్యే ఇంటిలిజేంట్ సినిమా ఇది. దీనిని సినిమా పండితులు మల్టీ ప్లేక్స్ సినిమా అంటారు. అందుకే ఈ సినిమా కమర్షియల్ గా అంత ముందుకు వెళ్ళలేదు.
రెండవ కారణం: మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు సుకుమార్ గత చిత్రాలపై మంచి అవగాహన ఉండటంతో ఆయన అభిమానులకు మాత్రమే నచ్చింది ఈ సినిమా. కమర్షియల్ అంశాలు బలవంతంగా సినిమాలో ఉండటంతో అద్భుతమైన స్క్రీన్ ప్లే లో పస లేకుండా పోయింది.
మూడవ కారణం: చిత్ర విడుదల సమయంలో అనుకున్న విధంగా ప్రచారం చేయలేదు. మొదటి రోజు నుంచే ప్రచారం చేస్తుంటే సినిమాలో దర్శకుడు, హీరో ఇమేజ్ మీద ఆధారపడి విడుదల చేసారు.
ఇక సుకుమార్ సినిమాను అర్ధం చేసుకోవాలి అంటే మాస్ హీరో అనే ఇమేజ్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సినిమాను సినిమాలా చూస్తే రంగస్థలం మాదిరి సుకుమార్ సినిమాలు అర్ధమవుతాయి.