సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆమె బుధవారం కన్నుమూశారు. అయితే ఇందిరా దేవి పార్థివ దేహం వద్ద మహేష్ బాబు కూతురు సితార వెక్కి వెక్కి ఏడ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇందిరా దేవి మృతి దగ్గర్నుంచి అంత్యక్రియల వరకూ ఎక్కడా మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కనిపించ లేదు.
నిజానికి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ చాలా పెద్దది. ఆయనకి అయిదుగురు పిల్లలు. పలు దేశాల్లో ఈ కుటుంబానికి చెందిన వాళ్లు సెటిల్ అయ్యారు. ఇందిరా దేవి గారి మరణ వార్త తెలిసిన వెంటనే కొందరు ఇండియాకి తిరగి రాగా.. మరికొందరు రాలేక పోయారు. వీరిలో మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ మాత్రం నానమ్మ మృత దేహం వద్ద కనిపించ లేదు.
దీంతో చాలా మంది గౌతమ్ కృష్ణ ఎక్కడ అని వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో నానమ్మ వద్ద గౌతమ్ కృష్ణ ఉన్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా అంటూ పరిశీలిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే ఉన్నత చదువుల నిమిత్తం గౌతమ్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అందుకే నానమ్మ మృత దేహం వద్ద సితార మాత్రమే కనిపించింది.
కాగా నానమ్మ ఇందిరా దేవితో గౌతమ్, సితారకు మంచి బాండింగ్ ఉంది. సెలవులు వచ్చిన ప్రతి సారి పిల్లలిద్దరూ నాన్నమ్మ దగ్గరకు తీసుకెళ్లేవారు మహేష్ బాబు. అందుకే నాన్నమ్మ ఇక లేదు అనగానే.. సితార అంతలా ఏడ్చింది. గౌతమ్ కూడా ఉండి ఉంటే ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకునే వాడు. గౌతం కృష్ణ విదేశాల్లో ఉండి పోవడంతో నానమ్మ చివరి చూపును నోచుకోలేక పోయాడు అంటూ పలువురు పేర్కొంటున్నారు.