అధికారంలో ఉంటే ఒక తీరు.. ప్రతిపక్షంలో ఉంటే మరో తీరు. సీటు మారిందంటే చాలు.. పాలసీ మారిపోతుంది. ప్రతిపక్షంలో ఉంటే.. అంతా అరాచకంగా కనపడుతుంది. అధికారంలో ఉంటే.. మాత్రం చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు. పైగా ఎక్కడలేని సామాజిక సృహ వచ్చేస్తుంది. అప్పటివి ఇప్పటివి వీడియోలు పెట్టుకుని చూస్తే.. మనకు దిమ్మ తిరిగిపోతుంది. వీరు వారేనా అనిపిస్తుంది.
చంద్రబాబునాయుడు మనకు దాదాపు అన్ని రకాల సినిమాలు చూపించేశారు. అధికారంలో ఇక తనకు తిరుగులేదనకున్నప్పుడు.. మనకు యోగా అవసరం.. ఆరోగ్యం అవసరం.. పిల్లలకు రాజకీయాలొద్దు.. చదువులు కావాలి.. అసలు రాజకీయాలు ఎన్నికలవరకే పరిమితం లాంటి స్లోగన్లు ఇచ్చారు. మధ్యలో ప్రతిపక్షంలోకి వచ్చాక.. మరోరకంగా సినిమా స్క్రిప్ట్ మార్చేశారు.
ఇప్పుడు వైసీపీ తంతు కూడా అలాగే ఉంది. మనకు గుర్తుంటే.. ఎక్కడైనా ఆడపిల్లలపైన దాడులు జరిగితే చాలు.. తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది.. చంద్రబాబునాయుడు పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదంటూ ఒకవైపు వాసిరెడ్డి పద్మ.. మరోవైపు రోజా ప్రెస్ మీట్లు పెట్టి దంచికొట్టేసేవారు. అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు వాటిని కవర్ చేసుకోలేక నానా అవస్ధలు పడేవారు. ఆ మహిళా నేతలే ఇప్పుడు వేరేగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారిప్పుడు అధికారంలో ఉన్నారు.
రోజా మేడమ్ అయితే కంప్లీట్ సైలెంట్ అయిపోయారు.. కేవలం టీడీపీ వాళ్లను తిట్టడానికి, తమ సామాజికవర్గాన్ని పొగడటానికి మాత్రమే నోరు విప్పుతున్నారు. ఆడపిల్లల మీద దాడి జరిగినా.. అది పక్క రాష్ట్రంలో జరిగినట్లే వ్యవహరిస్తున్నారు. ఒక్క ప్రకటన లేదు.. అసలు స్పందనే లేదు. ఎందుకంటే అప్పుడు నా డ్యూటీ వేరు.. ఇప్పుడు డ్యూటీ వేరన్నట్లే ప్రవర్తిస్తున్నారు.
వాసిరెడ్డి పద్మగారికి ఆ అవకాశం లేదు. ఎందుకంటే వారికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పోస్టు ఇచ్చారు. రియాక్ట్ కాక తప్పదు. అందుకే వారు మాత్రం స్పందిస్తున్నారు. ‘‘ప్రజల్లో మార్పు రావాలి. అవేర్ నెస్ పెరగాలి. ఆడపిల్లలపై దాడులు.. ఒక సామాజిక రుగ్మత. దాన్ని సమూలంగా నిర్మూలించాలి. అందరం కలిసి ఎదుర్కోవాలి.‘‘ ఇవీ ఇప్పుడు వేస్తున్న డైలాగులు. అదే తెలుగుదేశం హయాంలో అయితే.. అది ప్రభుత్వ వైఫల్యం.. ఇప్పుడు మాత్రం కాదు. అది సామాజిక సమస్య. ఈ విషయంలో తెలుగుదేశం తీరు కూడా అంతే. వారు అధికారంలో ఉన్నప్పుడు వారూ ఇవే మాటలు చెప్పారు.. ఇప్పుడ ప్రతిపక్షం అయ్యాక.. వారు కూడా వైసీపీలాగే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆడపిల్లలపై దాడులు అనేవి.. సమాజంపై ఇంటర్నెట్ చూపిస్తున్న దుష్ప్రభావం. ఆ సమయంలో నిందితుడికి.. పోలీసులు, కేసులు ఏవీ గుర్తు రావటం లేదు.. కేవలం వాడి క్షణికావేశం తప్ప. సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోను.. ఎదురుగా సమాజంలోనూ.. అందరికీ అందుబాటులోకి వచ్చింది.. తనకెందుకు దొరకదనుకున్నవాడు… అభం శుభం తెలియని చిన్నారులను సైతం చిదిమేస్తున్నారు. అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. విషయం బయటపడ్డాక మొహం కూడా చూపించుకోలేకపోతున్నారు.
నిజంగానే వీటిని కంట్రోల్ చేయాలంటే.. ఆడపిల్లలను కంట్రోల్ చేసే మన సమాజం.. మగవాళ్లను కంట్రోల్ చేయడమెలాగో ఆలోచిస్తే మంచిది. చిన్నతనం నుంచి వాడికి మంచి, చెడు నేర్పించే పద్ధతులు చూసుకోవాలి. ఏ టైము బడితే ఆ టైములో మగపిల్లవాడు తిరిగినా జాగ్రత్తలు తీసుకోవాలి. వాడి వల్ల ఎవరికీ హాని లేదన్న విషయం కన్ ఫామ్ చేసుకోవాలి. కాకపోతే మన రాజకీయ పార్టీలు మాత్రం అధికారంలో ఉంటే.. సామాజిక సమస్యగాను.. ప్రతిపవాడి వల్ల ఎవరికీ హాని లేదన్న విషయం కన్ ఫామ్ చేసుకోవాలి. కాకపోతే మన రాజకీయ పార్టీలు మాత్రం అధికారంలో ఉంటే.. సామాజిక సమస్యగాను.. ప్రతిపక్షంలో ఉంటే.. అధికారపక్షం వైఫల్యంగాను చూడటం మానేసి.. అందరూ కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలి.