ప్రధాని నరేంద్రమోడీ కొత్త స్టైల్లో కనిపిస్తున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుండే మోడీ గడ్డంతో ఉంటారు. ఆయన పూర్తిగా గడ్డాన్ని తీసేసిన ఫోటోలు దాదాపు కనిపించవు. ప్రధాని అయ్యాక కూడా అదే ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ టైం నుండి ఆయన గడ్డాన్ని పెంచుతున్నట్లు కనపడుతుంది.
కరోనా టైం నుండి ఇప్పటి వరకు ప్రధాని మోడీ అడ్రెస్ చేసిన సమావేశాలు చూస్తే స్పష్టంగా కనపడుతుంది. కానీ దీని వెనుక ఆంతర్యం ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ప్రధాని మంత్రి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి బలమైన కారణం లేనిది అలా చేయరు. కానీ ఆ కారణం ఏమై ఉండొచ్చు అన్నది హాట్ టాపిక్ అవుతుంది.
నిజానికి కరోనా లాక్ డౌన్ సడలింపులు రాకముందు… అందరిలాగే ప్రధాని దగ్గర పనిచేసే వారు లేరేమోనంటూ జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. బార్బర్ ను కలవలేదేమో అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. నిజానికి ప్రధాని స్థాయి వ్యక్తి అంత చిన్న కారణంతో గడ్డం చేయకుండా ఉంటారా…? అన్నది కూడా కీలకమే.
ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో పాటు మోడీని విమర్శించే కొన్ని గ్రూపులు మాత్రం… రామ మందిరం నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయన గడ్డం ట్రిమ్ చేయరని ధీమాగా చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశయం ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం. అలాంటిది నెరవేరే సమయంలో మోడీ గడ్డం ముట్టుకుండా ఉంటున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క మోడీయే కాదు… లాక్ డౌన్ నుండి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా తన హెయిర్ స్టైల్ మార్చేశారు. రాహుల్ తన ఓన్ స్టైల్ ను పక్కన పెట్టి తన తండ్రి రాజీవ్ గాంధీలా హెయిర్ స్టైల్ మెయింటెన్ చేస్తున్నారు. దీంతో ఇందులో కూడా బీజేపీ, కాంగ్రెస్ ల పోటీ పడుతున్నట్లున్నారు అంటూ చలోక్తులు వినిపిస్తున్నాయి.