సినిమా అనేది భారతీయులకు బాగా దగ్గరైపోయిన విషయం. సినిమా లేకపోతే పిచ్చేక్కే పరిస్థితి కూడా ఉంది. మన దేశంలో సినిమాల డిమాండ్ తెలుసుకున్న ప్రభుత్వాలు రాయితీలు కూడా ఇస్తూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే గతంలో సినిమాలను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసే వారు. కాని ఇప్పుడు సినిమా పూర్తి కావాలి అంటే కనీసం రెండేళ్ళు లేదా ఏడాది పడుతుంది. రాజమౌళి ఇప్పుడు చేస్తున్న సినిమాను నాలుగేళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. అప్పట్లో సినిమాలు ఎందుకు వేగంగా పూర్తి చేసే వాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందో చూద్దామా…?
అప్పట్లో ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలను చాలా తక్కువ టైం లో పూర్తి చేసే వారు. ప్రేక్షక ఆదరణ పొందిన సీన్ లు అయితే గంటల్లోనే అయిపోయేవి. ఉదాహరణకు పుష్ప క్లైమాక్స్ సీన్ అప్పట్లో తీయాలి అంటే రెండు లేదా మూడు గంటల్లో అయిపోయేది. ఇప్పుడు అయితే దానికి ఒక షెడ్యూల్ కూడా పెట్టుకుని ప్రత్యేకంగా కొన్ని రోజులు షూట్ చేసారు. అప్పుడు నార్మల్ గా వెళ్ళే ఆ సీన్ ఇప్పుడు అయితే pre-cg, cgi మరియు final touches అని చెప్పి కనీసం వారం తీసి ఉంటారు.
టెక్నాలజీ పెరిగి సినిమా షూటింగ్ ఈజీ గా ఉన్నా సరే దాన్ని వాడుకోవడంతో ఏళ్ళకు ఏళ్ళు తినేస్తుంది. ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 13-14 సినిమాలు రిలీజ్ చేస్తే మహేష్ బాబు అలా చేయడం లేదు. కనీసం ఏడాదికి రెండు సినిమాలు కూడా కష్టంగానే ఉంది. కృష్ణ అయితే ఒక్క రోజే రెండు మూడు సినిమాల్లో నటిస్తూ ఉండే వారు. అప్పటి హీరోల మాదిరి ఇప్పుడు ఎవరూ కష్టపడటానికి ఇష్టపడటం లేదు. అప్పట్లో వేగంగా సినిమాలు చేసిన చిరంజీవి ఇప్పుడు ఆచార్య సినిమాకు ఎంత టైం తీసుకున్నారో చూస్తున్నారుగా…?
అప్పట్లో సినిమాలకు భారీ సెట్టింగ్ లు ఉండేవి కాదు. ఇప్పుడు అయితే భారీ సెట్ లు కొత్త కొత్త లొకేషన్ లు అంటూ టైం తినేస్తున్నారు. అప్పట్లో రామానాయుడు స్టూడియో లేదా అన్నపూర్ణ స్టూడియో లో సినిమా అడుగు పెడితే అక్కడే దాదాపు సినిమా అయిపోయేది. ఏదైనా పల్లెటూర్ల అవసరం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు అనీల్ రావిపూడి, పూరి జగన్నాథ్ వంటి దర్శకులే స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు సినిమా ప్రమోషన్ ఒక యజ్ఞం లా సాగుతుంది గా మరి. pre-teaser, teaser, first-look, pre-trailer, trailer, pre-release, audio-release ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. జబర్దస్త్ లాంటి షో లు అదనం. ఈ టైం లో ఇంకో సినిమా వచ్చేసే అవకాశం ఉంటుంది.