అక్కినేని నాగార్జున చేసిన మిస్టేక్ వల్లే.. నాగ చైతన్య టాప్ హీరో కాలేకపోయాడా?.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు నాగర్జున చేసిన మిస్టేక్ ఏంటో.. చైతూ ఎందుకు టాప్ హీరో కాలేకపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని నాగేశ్వర్ రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగార్జున. అతి తక్కువ సమయంలోనే మంచి హీరోగా పేరు సంపాదించుకున్నాడు. మొదట నాగార్జున క్లాస్ సినిమాలు చేస్తూ.. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘శివ’ సినిమాతో మాస్ హీరోగా మారాడు నాగ్. ఇక అప్పటి నుంచి అటు క్లాస్.. ఇటు మాస్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
నాగ్ తర్వాత అక్కినేని వంశం నుండి వచ్చిన హీరో నాగ చైతన్య. ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా ప్లాప్ అయింది. దాని తరువాత వచ్చిన ‘ఏమాయ చేసావే’ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. సమంత, చైతూ జోడీలకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత చైతూ మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా మిగిలాయి.
ఈ విషయంలో నాగార్జున.. నాగచైతన్యతో అతనికి సెట్ అయ్యే క్లాస్ సినిమాలు చేయమని చెప్పి ఉంటే బాగుండేదని చైతూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా ఆయన చేసి ఉంటే ఇండస్ట్రీలో నాగ చైతన్య లవర్ బాయ్ గా అయినా మిగిలేవాడంటున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పుడు అటు మాస్.. ఇటు క్లాస్ కాకుండా పోయాడు.
ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలతో హిట్స్ అందుకుంటున్నప్పటికీ.. నాగ చైతన్య స్టార్ హీరోగా మాత్రం ఎదగలేక పోయాడు. ప్రస్తుతం చైతూ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కనుక హిట్ పడితే నాగ చైతన్య ఒక మంచి హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటాడు.