హిందూ సాంప్రదాయం పాటించే వారు ఆచారాల విషయాల్లో నమ్మకాల విషయంలో కాస్త బలంగానే ఉంటారు. అలాంటి ఒక విషయమే ఇళ్ళు తుడుచుకునే చీపురును తొక్కకూడదు అనే నమ్మకం. పెద్దలు చెప్పడంతో తర్వాతి తరాలు కూడా ఈ విషయాన్ని ఫాలో అవుతాయి. అసలు ఎందుకు అలా చెప్తారు అనేది చూద్దాం. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలీదు కానీ, లక్షీదేవి చీపురలో నివసిస్తుంది అని బలంగా నమ్ముతారు.
Also Read: ఆ పాన్ ఇండియా సినిమా పోస్ట్ పోన్ అయింది
శనీశ్వరుడికి చీపురు అంటే చాలా ఇష్టం అనే నమ్మకం కూడా ఉంది. అలాగే చీపురు పాడైతే కచ్చితంగా కొత్తది కొనాలి గాని ఆ చీపురుతో ఊడవడం మంచిది కాదు. నెగటివ్ ఎనర్జీ వస్తుంది అని గతంలో బలంగా నమ్మే వారు. ఇక కొత్త చీపురని కేవలం శనివారం రోజునే కొనాలి అనే నమ్మకం కూడా ఉంది. అలాగే ఇల్లు సూర్యోదయం తర్వాత ఇల్లు శుభ్రం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు శుభ్రం చేయడం వంటివి చేయకూడదు.
దీని వల్ల ధన నష్టం కలుగుతుంది. చీపురని ఇంటికి పడమటి వైపున పెడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. కాలితో తొక్కడం, చీపురు మీద నుండి గెంతడం వంటివి చేయకూడదు. మురుగు నీరు వెళ్ళే దగ్గర చీపురు పెట్టడం మంచిది కాదు. చీపురని ఎప్పుడూ కూడా నిలబట్టకూడదు. ఇక కొన్ని పురాణాల ప్రకారం చీపుర జ్యేష్టాదేవి ఆయుధంగా చెప్తారు. తమిళనాడు లో ఎక్కువగా ఆ దేవతను పూజిస్తారు. ఇక సాగరమదనంలో లక్షీదేవి కంటే ముందుగా అలక్షీ ఆవిర్భవించింది. ఆమె కూడా చీపురుని ఇష్టపడతారు అని నమ్ముతారు.
Also Read: మెగా పవర్ స్టార్ ఇంటికి బాలీవుడ్ స్టార్స్..విషయం ఏంటంటే..?