మనకు నీరసంగా ఉన్న సమయంలో ఎక్కువగా ఓఆర్ఎస్ తాగుతూ ఉంటాం. చాలా మంది ఆ డ్రింక్ తాగాలని సలహా ఇస్తూ ఉంటారు. అసలు ఓఆర్‌ఎస్ అంటే ఓరల్ రీహైడ్రాషన్ ద్రావణం. అయితే మనకు విరోచనాల సమయంలో ఆ డ్రింక్ తాగడం కరెక్ట్ కాదని ఓఆర్ఎస్ బాక్స్ మీద రాసి ఉంటుంది. ఎప్పుడైనా కలుషితమైన మంచినీళ్లు లేదా ఆహారం తిన్నపుడు అందులో ఉండే E.coli లేదా వేరే పారసైట్ వల్ల మనకు విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది.
ఆ సమయంలో మనలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం విరోచనాల రూపంలో బయటకు వస్తుంది. అందుకే విరోచనాల సమయంలో డీ హైడ్రేట్ అవుతాము. అసలు చాలా వరకు నీరసం కూడా వస్తుంది ఎందుకు అంటే శరీరం లో ఉన్న మినరల్స్ ( సోడియం, పొటాషియం,క్లోరైడ్) బయటకు వెళ్తాయి. ఓఆర్‌ఎస్ ద్రావణం లో ఇవి అన్ని మనకు చేరే విధంగా తయారు చేస్తారు.
ఓఆర్ఎస్ 4 భాగాలను కలిగి ఉంటుంది. 1. సోడియం క్లోరైడ్ 3.5 గ్రాములు, 2.ట్రైసోడియం సిట్రేట్ డై హైడ్రేట్ 2.9 గ్రాములు, 3.పొటాషియం క్లోరైడ్ 1.5 గ్రాములు, 4.గ్లూకోజ్, 20.0 గ్రాములు ఉంటుంది. వీటిని 1 లీటరు స్వచ్ఛమైన తాగునీటిలో కరిగించి తాగాల్సి ఉంటుంది. ఈ మధ్య జింక్ కూడా కలుపుతున్నారు..ఎందుకు అంటే మనకి జింక్ ఎక్కువ విరోచనాలు అవ్వకుండా కాపాడుతుంది. అందుకే మనం ఏ భయం లేకుండా ఓఆర్ఎస్ తాగవచ్చు. దాన్ని ఇంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. 6 స్పూన్స్ పంచదార, 1/2 చెంచా ఉప్పు, 1 లీటరు మరగబెట్టిన నీళ్లు కలిపి తాజాగా ఓఆర్ఎస్ తాగాలి.