వర్షపు నీటిని తాగడానికి వినియోగిస్తే ప్రపంచంలో నీటి కష్టాలు ఉండవు అనేది వాస్తవం. అయితే ఆ నీళ్ళు తాగడానికి మాత్రం పనికిరావు. దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. వర్షం సహజసిద్దమైన డిస్టిలేషన్ ప్రక్రియ వల్లనే పడుతుంది. అంటే ఆవిరవ్వడం అన్నమాట. ఆపై కండెన్సేషన్ జరిగి ప్రెసిపిటేషన్ తో వర్షం కురుస్తుంది. కాబట్టి వర్షపు నీటిలో ఘన పదార్ధాలు (డిసాల్వ్డ్ సాలిడ్స్) ఆ నీటిలో తక్కువగా ఉంటాయి.
అంటే వర్షపు నీరు చాలా ప్యూర్ గా ఉంటుంది. మనిషి త్రాగడానికి 500 mg/l వరకూ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వర్షం నీటిలో డిజాల్వ్డ్ సాలిడ్స్ 7mg l-1 గా ఉంటే నది నీటిలో డిజాల్వ్డ్ సాలిడ్స్ 118mg l-1 గా ఉంటాయి. సముద్రపు నీటిలో అయితే 34,400 mg l -1 గా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంటే ఒక లీటర్ వర్షం నీటిలో 7 మిల్లి గ్రాముల ఘన పదార్ధాలు కలుస్తాయి.
అయితే ఇది ప్రదేశాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. ఒక చోట పార్టిక్యులేట్ మాటర్ (పీఎం) ఎక్కువ స్థాయిలో ఉండటంతో… ఆ ప్రాంత ఉపరితలంలో(గాలిలో) ఎక్కువ కాలుష్యం వల్ల విష వాయువులూ(కార్బన్ దైఆక్సేడ్ , నైట్రోజన్ డైఆక్సైడ్ , సల్ఫర్ డైయాక్సయిడ్ ) అవీ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వర్షపు నీటిలో డిజాల్వ్డ్ సాలిడ్స్ శాతం మారే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి తీవ్రం కావడంతో ఆమ్ల వర్షం పడుతుంది. వర్షపు నీటిలో మనకి సరిపడినన్ని మినరల్స్ ఉండకపోవడం వల్ల అంతగా శరీరానికి ఉపయోగపడే అవకాశం ఉండదు.