గతంతో పోలిస్తే మాంసాహారం తినే వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. గతంలో వారానికి ఒకసారి తినే వాళ్ళు ఇప్పుడు రెండు లేదా మూడు సార్లు తింటున్నారు. కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంచితే దేవాలయాలకు వెళ్ళే సమయంలో మాంసాహారం తిని వెళ్ళడం మంచిది కాదు అంటారు. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:మంత్రి ఇల్లు ముట్టడి.. టెన్షన్ టెన్షన్
వాస్తవంగా చెప్పాలంటే… ఒకప్పుడు తినడానికి ఏమీ దొరక్క పోతే మనుషులు జంతువులను తినే వారు. ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆ విధంగా చేసే వాళ్ళు. వేరే ఆహారం దొరికినా సరే మాంసాహారం మీద ఉన్న ఇష్టం తో… తమను తాము తృప్తి పరుచుకోవడానికి బతికి ఉన్న జంతువులను చంపి తినే వాళ్ళు. ఇది ఒక రకంగా అన్యాయం అనే చెప్పాలి. భగవంతుడు సమస్త జీవ కోటిని రక్షించే వాడు అని అర్ధం వస్తుంది.
మరి దగ్గరకు వెళ్ళేటప్పుడు జీవహింస చేసి మాంసాహారం తిని వెళ్ళడం దేవుడికి నచ్చదు అనేది పండితులు చెప్పే మాట. అయితే శాఖాహారంలో హింస ఉంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మరో మాట ఏంటీ అంటే… మాంసాహారం తింటే మనకి మత్తు వచ్చే అవకాశం ఉంది. పెరుగు గాని, మాంసాహారం గాని తీసుకుంటే మనకు ఆలస్యంగా అరుగుతుంది. అప్పుడు మనకు మత్తు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం దైవ దర్శనం కి వెళ్తే దైవం పైన సరిగ్గా మనసు లగ్నం చేయలేం కాబట్టి వద్దు అంటారు. ఇక జీవ హింస వద్దని దేవుడు చెప్తే దేవుడి దగ్గరకు వెళ్లి కోళ్ళు మేకలు కోయడం ఏ కోణంలోకి వస్తుందో…?