హైందవ సాంప్రదాయంలో ఉండే ఎన్నో సాంప్రదాయాలు ఆసక్తిగా ఉంటాయి. మనిషి పుటుక నుంచి చావు వరకు ఎన్నో ఆసక్తికరంగా జరుగుతాయి. పుట్టిన తర్వాత చేసే కార్యక్రమాలు ఎన్నో అర్ధాలు చెప్తాయి. అలాగే రజస్వల, అన్నప్రాసన, ఓణీలు, వివాహంలో జరిగేవి, సీమంతం కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమాలు మనకు ఆసక్తికర విషయాలు చెప్తాయి. ఇక చావు విషయంలో కూడా ప్రతీ పని ఏదోక అర్ధం చెప్తుంది.
Also Read:నవ్వకండి బ్రో.. ఖాళీ మద్యం సీసాలతో పంచాయతీలకు ఆదాయం!
అలాంటి విషయమే ఇప్పుడు ఒకటి చూద్దాం. మనం నిద్రించే సమయంలో తల ఉత్తరం వైపు పెట్టుకుని నిద్రించడం కరెక్ట్ కాదని చెప్తారు. అసలు అలా ఎందుకు చెప్తారు ఏంటీ అనేది చూస్తే… ఉత్తరానికి తల పెట్టుకోకపోవటం వెనక శాస్త్రం ఏమీ లేదు గాని… ఊరికి ఉత్తరాన స్మశానం ఉంటుంది. చనిపోయిన వారిని దహనం చేసే వరకు ఉత్తరదిక్కుగా పడుకోబెట్టటం అనేది హైందవ పద్ధతి.
మనిషి దేహం నుండి ఆత్మలు ఉత్తర దిశలో వీడిపోతాయనే నమ్మకం ఉంది ముందు నుంచి. ఉత్తర దిక్కున పడుకుంటే… ఆత్మారాముడికి, అటు యమదేవుడికి సంకేతాలు పంపినట్లవుతుందనే భయంతో… ఉత్తరానికి తల ఉంచి నిద్రపోతే అరిష్టం అని ఒక నమ్మకం. భూమికి ఈ ఉత్తర, దక్షిణ వైపుల్లో విస్తరించి ఉన్న భూ అయస్కాంత క్షేత్రం మన శరీరం మీద దుష్ప్రభావం కల్గిస్తుందని మరికొందరి నమ్మకం. అయితే మనం ఎటువైపు పడుకున్నా అందులో ఏ విధమైన తేడా ఉండదు. అయితే వైద్యులు మాత్రం మనం ఎటువైపు పడుకున్నా సరే హాయిగా పడుకుంటే చాలని చెప్తున్నారు.
Also Read:ఈడీ తీరుపై కాంగ్రెస్ నిరసనలు ..!