మనిషికి అత్యంత దగ్గరైన జంతువులలో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అయితే చాలా మందికి కుక్కలకు ఉండే కొన్ని లక్షణాలపై మాత్రం అవగాహన తక్కువ. అందులో ఒకటి… కుక్కలకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నచ్చదు. దాని వెనుక ఉన్న కారణం ఏంటో చూద్దాం. వాస్తవానికి… కుక్కలు ప్యాక్ అనిమల్స్ అన్నమాట. అంటే… వాటి కళ్ళకు కనిపించే జీవులన్నింటినీ రెండు వర్గాల్లో గుర్తు పెట్టుకుంటాయి.
Also Read: అరుదైన ఘటన… ఒకే కాన్పులో ముగ్గురు కవలల జననం
ఒకటి ఫ్రెండ్లీ వర్గం – అంటే పెంపుడు కుక్క అయితే ఇంట్లోని మనుషులు, ఇంట్లోకి తరచూ వచ్చి పోయే మనుషులు, ఇంట్లోని మిగతా జంతువులు ఇలా అన్నింటిని ఫ్రెండ్లీ వర్గంలో పెట్టుకుంటాయి. మిగతా ఏ జీవి అయినా సరే అది శత్రు వర్గంగానే భావిస్తాయి. అది ఎలుక అయినా, సింహం అయినా ఏది అయినా సరే. కుక్కలు ఎలుకను చూస్తే భయపెట్టడానికి అరిస్తే సింహాన్ని చూస్తే భయపడి మొరుగుతాయి. కుక్కల దృష్టిలో ప్యాక్ లోని జీవులన్నీ కుక్కలగానే భావిస్తాయి.
కాకపోతే వాటి దృష్టిలో కొన్ని రెండు కాళ్ళ మీద నడిస్తే… కొన్ని పెద్దగా ఉంటాయి. సొంత ప్యాక్ లోని వాటిని అవి రెండు కాళ్ళవైనా నాలుగు కాళ్ళవైనా, కళ్ళలో కళ్ళు పెట్టి చూడ్డాన్ని ఇష్టపడతూ ఉంటాయి. అప్పుడప్పుడూ అవి కూడా చూస్తూ ఉంటాయి. మనం తిరిగి చూడకపోతే మాత్రం అలుగుతాయి కూడా. అదే, శత్రు వర్గం కుక్కలు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఆ కుక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండానే బల ప్రదర్శన కు సిద్ధంగా ఉంటాయి. అది వాటికి ఉన్న స్వభావం. చాలెంజ్ చేసినట్టుగా భావించి గొడవకు దిగుతాయి. ఎదుటి ప్రాణి పరిమాణం చూసి భయపడటం లేదా భయపెట్టడం కోసం అరుస్తూ ఉంటాయి.
Also Read: వీఐపీలకు భద్రత.. ఎందుకు ఉపసంహరించారు? ఎందుకు పునరుద్ధరిస్తున్నారు?