మనకు తెలియని కొన్ని కొన్ని విషయాలు ప్రాణాల మీదకు తెస్తూ ఉంటాయి. అలాంటి ఒక విషయమే స్నానం చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చాలా మందికి బాత్ రూమ్ లో ఫిట్స్ వస్తుంది. గమనించే ఉంటారు బాత్ రూమ్ లో ఫిట్స్ కారణంగా పడిపోయి ప్రాణాలు పోయిన వాళ్ళను. అసలు ఎందుకు బాత్ రూమ్ లో వస్తుంది…? తలస్నానం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
తల స్నానం చేసే సమయంలో ముందు తల మీద నీళ్లు పోయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తల తడిగా అలాగే చల్లగా ఉన్నప్పుడు, తల వేడెక్కడానికి రక్తం వేగంగా ప్రవహిస్తుంది. ఆ స్పీడ్ కు రక్తనాళాలు కుచించుకుపోయి ఉంటే,అథిక ఒత్తిడి వలన రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఎక్కువ. ఇది సాధారణంగా బాత్ రూమ్ లోనే జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Advertisements
అరికాలు మీద నీళ్లు పోసుకుని ఆ తర్వాత నిదానంగా పైకి రావాలి. దిగువ కాళ్ళు, తొడ, పొత్తికడుపు మరియు తరువాత భుజం వరకు రావాలి. అప్పుడు ఒక పది సెకన్ల పాటు కాస్త విరామం ఇవ్వడం మంచిది. మన శరీరం నుంచి ఆవిరి వస్తు ఉంటుంది. ఉదాహరణకు గ్లాసులో వేడి నీళ్లు పోసి ఆ తర్వాత వెంటనే కూలింగ్ వాటర్ పోస్తే గ్లాసు పగిలిపోతుంది. మన తల కూడా అంతే అన్నమాట. సహజంగా, శరీర ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉండటం నీళ్లు చల్లగా ఉండటంతో… డైరెక్ట్ గా తల మీద పోసుకుంటే గాలి అకస్మాత్తుగా ఆగిపోతుంది. రక్తనాళాలు పగిలి పోయే అవకాశం ఉంది.