మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు చాలా గొప్పగా ఉంటాయి అనే మాట వాస్తవం. ముఖ్యంగా వివాహం, పిల్లలు పుట్టడం వంటి విషయాలకు సంబంధించి పూర్వికులు చాలా జాగ్రత్తలు తీసుకుని వాటిని మన తరాలకు బలంగా చెప్పారు. అందులో ఒకటి పుట్టిన పిల్లలకు వెంటనే కొత్త బట్టలు ఎందుకు వేయరు…? దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటీ…?
Also Read:పంచభక్ష్య పరమాన్నాలు అంటే అర్ధం ఏంటీ…?
ముందు తెలుసుకోవాల్సింది… పుట్టబోయే బిడ్డ కోసం ముందు గానే బట్టలు కొని పెట్టరు. ఆడపిల్ల అయినా మగ పిల్లాడు అయినా కొన్నాళ్ళ పాటు వేసే బట్టలు ఒకే రకంగా ఉంటాయి దాదాపుగా. అయినా సరే ముందుగా బట్టలు కొనడం అనేది మంచిది కాదు అంటారు. దాని వెనుక ఉన్న బలమైన కారణం దురదృష్టవశాత్తూ ఆ పాపాయి చనిపోతే వస్తువులు చూసినప్పుడల్లా దుఃఖమే కదా అని. గతంలో గర్భం నిలిచింది అనే విషయాన్ని సీమంతం వరకు చెప్పే వాళ్ళు కాదు.
ఇక కొత్త బట్టలు ఎందుకు వేయరు అంటే… కొత్త బట్టలలో మృధుత్వం అనేది ఉండదు కాబట్టి. గట్టిగా, రాసుకుంటున్నట్టు ఉండటం పెద్ద సమస్య. అలా రాసుకుంటే చిన్న పిల్లల చర్మం సున్నితం కాబట్టి తెగిపోయే అవకాశం ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టి కొన్నా సరే బట్టల్లో ఉండే రంగు గాని ఫ్యాబ్రిక్ గాని ఇతర రసాయానాలు గాని వాటి నుంచి వచ్చే వాసన శిశువు ఆరోగ్యానికి మంచిది కాదు. కొత్త బట్టలు ఎవరైనా ఇచ్చినా వాళ్ళకి మాత్రం పాతవే ఉపయోగిస్తారు. ఇతర పిల్లలు వేసుకుని తీసివేసినవి లేదా పాత లుంగీలు, చీర ముక్కలు వంటి వాటినే వాడతారు. కొత్త బట్టలు వేసినా సరే ఒక అరగంట వేసి తీసేస్తారు.
Also Read:ఈసారి ఖైరతాబాద్ గణేశుడి రూపం ఇదే!