కుక్కలకు పెట్టే ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ ఆహారం పడితే అది పెడితే లేనిపోని సమస్యలు వచ్చినట్టే ఉంటుంది. ఇక కుక్కలకు స్వీట్ ఫుడ్ ఎక్కువగా పెట్టకూడదు అంటారు. మనం ఎక్కడ చూసినా స్వీట్ తింటే కుక్కకు పిచ్చి ఎక్కుతుంది కాబట్టి పెట్టకూడదు అంటారు. అసలు కుక్కకు స్వీట్ ఫుడ్ ఎందుకు పెట్టకూడదు. దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటీ…?
Also Read:వంట గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్
ఆహారంలో ప్రధానంగా శక్తిని ఇచ్చేటువంటి పదార్థాలను కార్బోహైడ్రేట్లు అని పిలుస్తాం. ఈ కార్బోహైడ్రేట్లు గ్లూకోజు ,ఫ్రక్ట్రోజ్ వంటి సరళ పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి నాలుక మీద ఉండే తడితో చర్య జరిగి తీపిగా ఉంటాయి. తీపి పదార్థాలు మెదడులో డోపమైన్ అనే ఒక రసాయనాన్ని విడుదల చేస్తే… అది క్రమంగా వ్యసనంగా మారుతుంది. అది మనిషి అయినా కుక్క అయినా సరే. కుక్కలకు ఆ ఆహారం అలవాటు చేస్తే అఆహారంలో తీయగా ఉంటేనే తినడానికి ఇష్టపడతాయి.
లేదంటే అవి ఆహారాన్ని ఇష్టపడవు. ఇలా ప్రతి రోజు తింటే గ్లూకోస్ మెటబాలిజం లో మార్పులు జరిగి అధికంగా ఉన్నటువంటి గ్లూకోజు కొవ్వు పదార్థాలు గా మారి కుక్కలలో ఒబేసిటీ వస్తుంది. ఆ తర్వాత ఇన్సులిన్ పనితీరు దెబ్బతినడంతో మనుషులలో వచ్చినట్లు కుక్కలలో కూడా డయాబెటిస్ వస్తుంది. హృదయానికి కూడా ఇది ఇబ్బందిగా మారుతుంది. కుక్కలకు వాడే పెట్ ఫుడ్ లలో తీపి కోసం కార్న్ సిరప్ లాంటివి కలుపుతూ ఉంటారు.
వాటితో ఇబ్బంది లేకపోయినా సరే అవి పెట్టకుండా ఉండటమే మంచిది. పెట్ ఫుడ్ లలో జైలిటాల్ వంటి తీపి కలగజేసే పదార్ధాలు ఉంటే మాత్రం వాటి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. కాలేయ సంబంధ వ్యాధులను కూడా కలిగిస్తూ ఉంటాయి. అందుకే కనుక తీపి పదార్థాలను కుక్కల ఆహారంలో ఎంత తగ్గిస్తే అంత మంచిది. డాక్టర్ తో మాట్లాడి ఎంత ఇవ్వాలో అంత ఇస్తే మంచిది.