మన దేశంలో సాంప్రదాయాలు కాస్త ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం భయం కొంత అయితే నమ్మకాలు మరికొంత. అలాంటిదే ఒక నమ్మకం రాత్రి పూట సూదులు అమ్మకపోవడం. మన సంప్రదాయం ప్రకారం రాత్రిపూట పాత బట్టలు కుట్టడం అనేది మంచిది కాదు. దీని వెనుక శాస్త్రీయ దృక్పథం ఉందని పెద్దలు అంటున్నారు. 50, 60 దశకాల్లో 75 శాతం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు.
Also Read:జాతీయ పార్టీ ఏర్పాట్లలో కేసీఆర్ బిజీబిజీ
70, 80 దశకాల్లో విద్యుద్దీకరణ క్రమంగా వేగం పుంజుకుంది. ఆ కాలంలో రాత్రిళ్ళు బట్టలు కుడితే చీకటి, లేదా మసక వెలుగులో చేతిలో గుచ్చుకునే ప్రమాదాలు ఎక్కువ. సూది ఇనుము కాబట్టి, గుచ్చుకుంటే ధనుర్వాతం వచ్చే అవకాశం ఉందని భయపడే వాళ్ళు. ధనుర్వాతం వస్తే ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి రాత్రిళ్ళు పాత బట్టలు కుట్టకూడదనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఇదే క్రమంలో రాత్రి వేళల్లో సూది అమ్మకూడదు అనే నియమాన్ని తీసుకొచ్చారు. రాత్రిపూట సూది అందుబాటులో లేకపోతే కుట్టే సమస్యే ఉండదు అని.
ఇక మంగళవారం, శుక్రవారం, అష్టమి, అమావాస్య రోజుల్లో బట్టలు కుట్టరాదనే సాంప్రదాయం కూడా ఉండేది. దర్జీలు అమావాస్య రోజు తమ దుకాణాలకు సెలవు కూడా ఇస్తూ ఉండే వారు. ఇక క్రమంగా ప్రజల్లో మార్పు రావడంతో మేజర్ పంచాయతీలు, పట్టణాల్లో ఆదివారం గానీ, మంగళవారం గానీ సెలవలు ఉంటున్నాయి. అయితే మన దేశంలో రాత్రిళ్ళు సూదులు అమ్మరాదనే సాంప్రదాయాన్ని కర్నాటక లో ఇప్పటికీ కచ్చితంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఉంది. ఇక మరో కారణం రాత్రిళ్ళు సూదులమ్మితే లక్ష్మీ కటాక్షం ఉండదని బలమైన నమ్మకం.
Also Read:కేజీఎఫ్ పై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు