పెట్రోల్ బంకు లో ఫోన్ వాడటం వల్ల నష్టాలు ఎక్కువని, వాడితే అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అని చాలా మంది హెచ్చరిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో లు కూడా మనల్ని భయపెడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఈ మధ్యలో కాలంలో ఏ రూపంలో ప్రమాదం జరిగినా పలానా రూపంలోనే జరిగింది అనే ప్రచారం చేయడం, భయపెట్టడం ఎక్కువైంది.
ఇక పెట్రోల్ బంకులో మొబైల్ వాడితే ఎందుకు ప్రమాదం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెట్రోలు బంకుల్లో పెట్రోలు నింపేటప్పుడు మొబైల్ ఫోన్ వాడడంపై నిషేధం విధించారు. మన ఫోన్ కు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వెలువడే విద్యుదయస్కాంత తరంగాల శక్తి కారణంగా… లేదంటే స్థిర విద్యుత్ (స్టాటిక్)తో పెట్రోలు ఆవిరి అంటుకొని మండే ప్రమాదం ఉందని చెప్తారు.
అయితే ఇది ఎక్కడా కూడా శాస్త్రీయంగా ఋజువు అయినట్టుగా లేదు. ఇప్పుడు ప్రతి పెట్రోలు బంకులోనూ క్రెడిట్ కార్డు స్వైపింగ్ యంత్రాలు వాడుతున్నారు గాని వాటి కారణంగా ప్రమాదాలు జరిగినట్టు లేదు. బంకులో మొబైల్ వాడితే పెట్రోలు మండిపోయే సంభావ్యతకంటే వ్యక్తిగత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పెట్రోల్ బంకులో వాడకుండా ఉండటమే ఉత్తమం. అయితే ఫోన్ మాట్లాడటంతో కొన్ని ప్రమాదాలు జరిగాయి గాని కారణం అదే అనే విషయం చెప్పలేదు ఎవరూ.