తెలుగులో కొందరు హీరోలు చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నట వారసులుగా వచ్చినా సరే వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళను ఒక రేంజ్ లో ఉంచాయి అనే మాట వాస్తవం. వరుసగా సినిమాలు చేస్తూ సినిమా పరిశ్రమకు హిట్ లేని సమయంలో మంచి హిట్ లు ఇస్తూ ఒక రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ముందు చెప్పుకునే వారిలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. మొదటి సినిమా నుంచి ఇప్పుడు చేసే సినిమా వరకు మంచి నటుడిగా దూసుకుపోతున్నాడు.
Also Read:అహింస….దగ్గుబాటి అభిరామ్ కొత్త సినిమా
ఈ క్రమంలో 2005 లో అతను చేసిన సినిమా ఒకటి భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆ సినిమానే నరసింహుడు. స్టార్ డైరెక్టర్ బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన అల్లరి రాముడు సినిమా మంచి హిట్ అయింది. సమరసింహారెడ్డి సినిమాను నిర్మించిన టీడీపీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు ఈ సినిమాను కూడా నిర్మించారు. దీనితో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఫాన్స్ చాలా ఆశగా ఎదురు చూసారు.
ఈ సినిమాలో హీరోయిన్ లు గా అమీషా పటేల్, సమీరా రెడ్డిని తీసుకొచ్చారు. మొదటి రోజే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అప్పటికే ఎన్టీఆర్ కు ఆది, సింహాద్రి లాంటి మాస్ హిట్ లు వచ్చాయి. ఇప్పుడు అదే మాస్ స్టోరీ తో సినిమా వస్తుందని ఆశించినా… అనుకున్నది జరగలేదు. కొన్ని ఇబ్బందులతో… మొదటి రోజు చాలా ప్రాంతాలకు సినిమా బాక్సులు వెళ్ళలేదు.
ఇక చాలా సెంటర్ లకు రెండో రోజు సాయంత్రానికి బాక్స్ లు పంపారు. అప్పటికే ముందు రోజు రిలీజ్ అయిన సెంటర్ ల నుంచి ఫ్లాప్ టాక్ రావడం, రొటీన్ కథ కావడం, కథనం లో అంత పట్టు లేకపోవడంతో… సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక ఈ సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో నిర్మాత ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు. హుస్సేన్ సాగర్ లో దూకే టైం లో పోలీసులు అడ్డుకున్నారు.
Also Read:నెత్తురోడిన రోడ్లు… 24 గంటల్లో 995 రోడ్డు ప్రమాదాలు