ఏటీఎం భద్రత అనేది బ్యాంకు లకు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారిన విషయంగా చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఏటీఎం దొంగతనాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనిపై పోలీసులు కూడా సీరియస్ గా దృష్టి సారించారు. అయితే ఏటీఎం ల భద్రత విషయంలో భద్రతా ఏజెన్సీ లు జాగ్రత్తగా వ్యవహరించడం లేదు అనే విమర్శలు వినపడుతున్నాయి. ఇష్టారీతిన వ్యవహరించడం ఇప్పుడు దొంగతనాలకు అనువుగా మారింది అనే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే చాలా మందికి ఉండే సందేహం ఏంటీ అంటే.. ఏ.టి.ఎం సెక్యూరిటీ గార్డులుగా వయసు పైబడిన వారినే ఎందుకని ఎక్కువ నియమిస్తారు అనేది అర్ధం కాని విషయం. బ్యాంకు ఒక సెక్యూటిటీ ఏజెన్సీ కి కాంట్రాక్టు ఇచ్చిన తర్వాత నియామకం అనేది సదరు ఏజెన్సీ ఇష్టం. వారికి ఎలాంటి వారి వలన వారి కార్యకలాపాలు నిర్వహించడానికి అనువుగా ఉంటుంది అనేది అక్కడ ముఖ్యం. పలు కీలక అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకుంటారు.

ఎంత జీత భత్యాలు ఇస్తే పనిచేసే వాళ్ళు దొరుకుతారో అనేది కూడా మరో విషయం. వయసులో ఉన్న వాళ్ళను తీసుకుంటే వాళ్ళు మరో ఉద్యోగం వస్తే ఇప్పుడు చేసే ఉద్యోగం వదిలేసే సూచనలు ఉన్నాయి కాబట్టి వయసు పైబడిన వారినే తీసుకుంటారు. వయసు మళ్ళిన వారికి డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి చేసే ఉద్యోగాన్ని శ్రద్దగా చేయవచ్చు. అలాగే డబ్బు విషయంలో వారికి దుర్భుద్ధి మరియు సాహసం చేసే అవకాశం తక్కువగా ఉంటాయి. క్యాష్ లోడ్ చేసే సమయంలో కూడా వాళ్ళు దొంగతనం చేసే అంత ఫాస్ట్ గా ఉండరు. యువకులు అయితే జీతాలు కూడా ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆ అడుగు వేస్తారు.
Also Read: వెండితెర అంటే ఏంటీ…? మొదట్లో సినిమా స్క్రీన్ ఎలా ఉండేది…?