ప్రతిపక్షం ప్రజల కోసం పని చేయాలి. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాలని, ఎవరైనా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తుంటే, ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంటే ఎలాంటి వారిని ఎండగట్టాలని .
కానీ తెలంగాణ లో ప్రతిపక్షాలు మౌనంగా చోద్యం చూస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మెఘా కృష్ణారెడ్డి సంస్థల మీద ఐటి దాడులు జరుగుతుంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం, వామపక్షాలు సైలెంట్ గా ఉండడం.
గత రాత్రి 12 గంటల నుండి ఏకకాలం లో మెఘా సంస్థలు ,ఇళ్ళ పై ఐటి దాడులు జరుగుతున్నాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటి అధికారులు. ఇప్పటికే కాళేశ్వరం , ఆర్టీసీ లో మెఘా దోపిడీ దందా పై వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలు , రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తున్న మేఘా గురించి నోరు విప్పరు. మీడియా ఎలాగో మేఘా, మై హోమ్ గడీల్లో ఉంది కాబట్టి మాట్లాడదు. మరి ప్రతీసారీ గడీల పాలన నడుస్తోంది అని విమర్శించే , ప్రతిపక్ష పార్టీలు ఎవరి గడీలలో ఉన్నారు. అవినీతి పై ప్రెస్ మీట్లు దంచి కొట్టే నాయకులు ఏమైపోయారు.
ఇక్కడ సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మేఘా, మై హోమ్ చేతుల్లోనే ఉన్నారన్నది బయట బలంగా వినిపిస్తున్న టాక్. దాదాపు అన్ని పార్టీలకు ఫండింగ్ చేసేది కూడా ఈ కార్పొరేట్ పెద్ద మనుషులే అని లోకం కోడై కూస్తోంది.
ప్రజలు ప్రతిపక్షాలను నమ్మలంటే ఇలాంటి శక్తుల చేతుల్లోంచి బయట పడాలని జనం కోరుకుంటున్నారు.