కొంత కాలం క్రితం సినిమా ఇండస్ట్రీ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సినిమా పెద్దలందరూ కలిసి వజ్రోత్సవం పేరుతో ఓ వేడుక చేసుకున్నారు. అయితే ఆ వేడుకల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మీద కొన్ని వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. ఎందుకంటే లెజండరీ అనే పేరు మీద చిరంజీవికి ఓ అవార్డు ఇవ్వాలనుకున్నారు.
ఆ సమయంలో మోహన్ బాబు మాట్లాడుతూ..ఆయన చేసిన గొప్ప పనుల గురించి వివరిస్తూ..నేను లెజండరీ కాదా, కృష్ణంరాజు లెజండరీ ఆర్టిస్ట్ కాదా అంటూ ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి మీద ఒకింత అసూయను వెళ్లగక్కారనే చెప్పవచ్చు. దాంతో అదంతా విన్న తరువాత పవన్ కళ్యాణ్ స్టేజీ మీదకి వెళ్లి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఆయన్ని తమ్ముడు అని సంభోదించి మాట్లాడారు.
అలా పవన్ కల్యాణ్ మోహన్ బాబు మీద వెటకారంగా పంచులు వేయడంతో మోహన్ బాబు సైలెంట్ గా కూర్చున్నాడు. అలా వజ్రోత్సవ వేడుకల్లో చాలా మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి.ఇక దాంతో చిరంజీవి కూడా ఈ అవార్డు తీసుకోవడానికి నేను అర్హుడిని కాదు అని చెప్పి ఆ అవార్డు ని వెనక్కి ఇచ్చేసారు.
అలా చిరంజీవి తాను చెప్పిన ఒక్క మాట తో అక్కడ అప్పటిదాకా నడిచిన గొడవ ఒక్కసారి గా కామ్ అయిపొయింది.అందుకే అప్పటి నుంచి సినిమా హీరోలతో ఏదైనా పార్టీ చేద్దాం, ఫంక్షన్ నిర్వహిద్దాం అని ఏ ఒక్క సినీ పెద్ద కూడా ప్రయత్నం చెయ్యట్లేదు.
Also Read: మగధీర సినిమా వద్దన్న హీరో ఎవరంటే…!