ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రైతుల ఆందోళనలు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తాజాగా రాజధాని విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కు రాజధాని విషయంలో రూపొందించిన ఓ నివేదికను జనసేన నేత నాదెండ్ల మనోహర్ అందించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రానికి మూడు రాజధాలు అనే అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలి. ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం జరగాలని ఎవరు కోరుకోకూడదు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితుల ఆధారంగా అందరు ఒక అవగాహనకు రావాలని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.