మీడియా లెజెండ్ రవిప్రకాశ్‌ను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు… కస్టడీకి కోరుతున్న అంశాలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కస్టడీ ఎందుకు కావాలంటే… అక్టోబర్ 5న అరెస్ట్ చేసిన అంశంలో, అలంద మీడియా చేసిన ఫిర్యాదుపై ఇంకా లోతుగా విచారణ చేయాలని, సంస్థ ఆరోపించిన 18కోట్ల రూపాయల మొత్తం ఎందుకు డ్రా చేశారు, ఎక్కడకు వెళ్లిందో వివరాలు సేకరించాల్సి ఉందని వాదిస్తోంది. ఇదే అలందా మీడియా నిధుల దుర్వినియోగం కేసులో… ఇప్పటికే పోలీస్‌లు 3 రోజుల పాటు విచారించారు. కానీ మళ్లీ ఇప్పుడు 10రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతోంది.
కానీ గతంలో ఇదే అలందా మీడియా చేసిన నిధుల దుర్వినియోగం కేసులో హైకోర్ట్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటమే కాకుండా, ఈ కేసులో అరెస్ట్ చేయరాదని… ఇంకా ఏవైనా ఆధారాలు, ఆరోపణలు ఉంటే కోర్టుకు సమర్పించాలని పోలీస్‌శాఖను ఆదేశించింది. అదే సమయంలో రెండ్రోజులకోసారి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాలని రవిప్రకాశ్‌నూ ఆదేశించింది. అందుకు అనుగుణంగా రవిప్రకాశ్ పోలీస్‌స్టేషన్‌లో హజరువుతూనే ఉన్నారు. కానీ సడెన్‌గా పోలీసులు కస్టడీ కోరుతున్నారంటే… మరికొంత కాలం ఇబ్బందిపెట్టే ఉద్దేశం ప్రభుత్వానిదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.