అరెస్ట్ బెదిరింపులకు రవిప్రకాశ్ లొంగలేదా…? అరెస్ట్ అంటూ ప్రకటించి కొద్ది దూరం తీసుకెళ్లి ఎందుకు వెనక్కి తీసుకొచ్చారు…? ఎవరి ఫోన్‌కాల్‌తో మళ్లీ వెనక్కి వచ్చేశారు…? అసలేం జరిగింది ?
హైదరాబాద్: టీవీ9 వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ అరెస్ట్‌పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్ట్ చేశామని చెప్పి సగం దూరం తీసుకెళ్లిన పోలీసులు సడెన్‌గా యూటర్న్ తీసుకొని మళ్లీ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అరెస్ట్ చేస్తున్నామని భయభ్రాంతులకు గురిచేసి, ఆయనతో తప్పులను ఒప్పించే ప్రయత్నం చేశారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నాం అంటూ సాయంత్రం వరకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్లో ఉంచిన పోలీసులు సాయంత్రం 6.30గంటల తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్తూ తర్వాత రవి ప్రకాశ్ అరెస్ట్‌ను దృవీకరించారు. కానీ గంట వ్యవధిలో తిరిగి స్టేషన్‌కు తీసుకు రావటం ఎందుకనేది చర్చనీయాంశం అయ్యింది.