పద్మశ్రీ అవార్డు గ్రహీత, తత్వవేత్త, మత ప్రబోధకుడు గరికపాటి పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తుందని, స్మగ్లర్‌ను హీరోగా చిత్రీకరించడం సమాజాన్ని దిగజార్చడంతో పాటు ప్రజల ఆలోచనలను కూడా కలుషితం చేస్తుందని అన్నారు.
నిజానికి గరికపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇదేం మొదటి సారి కాదు, గతంలో చాలా సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పొట్టి దుస్తులను గురించి, స్త్రీల గురించి ఇలా చాలానే విమర్శలు చేశారు.
అయితే ఇప్పుడు పుష్ప పై గరికపాటి చేసిన వ్యాఖ్యలు అతని ప్రమోషన్ కోసం చేసినవే అని టీం భావిస్తోందట. కాబట్టి కౌంటర్ ఇవ్వటం వల్ల ఉపయోగం లేదని అనుకుంటున్నారట.
పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో గరికపాటికి కౌంటర్ ఇవ్వడం కంటే సినిమా పార్ట్ 2 తీయడం పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారట. కాగా పుష్ప తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది అని పలువురు అనుకుంటున్నారు.