హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం అనేది తప్పనిసరిగా పాటించే ఆచారం. మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా సరే హిందువులు కచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు. అసలు ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అనేది చాలా మందికి తెలియదు. నుదుటి భాగానికి అంగారకుడు (కుజుడు) అధిపతి, అంగారకుడిని అగ్ని దేవుడు అని పిలుస్తారు. అగ్ని రూపాన్ని సింధూర వర్ణంతో పోలుస్తూ ఉంటారు.
Also Read:శ్రీదేవి కండిషన్స్…పాపం చిరుకి ఎన్ని కష్టాలో!!
కాబట్టి నుదుటిమీద ఎర్రటి బొట్టు పెట్టుకోవడం అనేది ఆచారంగా మారిన విషయం. బొట్టు ఎర్రదనంగా తెల్లని విభూది పూస్తే అగ్ని మాదిరి కనపడుతుంది. విభూదిని అందుకే మూడు వేళ్ళతో పూసుకుంటారు. కాబట్టి మనకు మూడు గీతల మాదిరి కనపడుతుంది. దీనిని శివతత్వంగా పిలుస్తారు. ఇది పురాతన విధానాంగా భావిస్తూ ఉంటారు.దీనినే శివ తత్వం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది పురాతన విధానం.
వైష్ణవం మొదలైన అనంతరం శివ, వైష్ణవ తత్వాల తేడా కోసం మూడు వేళ్ళతో అడ్డంగా విభూది పూయడం మాని నిలువుగా పూయడం మొదలుపెట్టారు. దానిమీద ఎర్రటి జ్యోతి వెలిగించినట్లు బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు. వైష్ణవంలో వర్గాలు ఏర్పడిన అనంతరం ఒక వర్గం వారు తెల్లని ప్రమిద లో జ్యోతి వెలిగించినట్లు బొట్టు జరుగుతుంది. మరికొందరు ఎర్రని జ్యోతి మాదిరి పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరు ఏ విధంగా బొట్టు పెట్టుకున్నా సరే అగ్నిదేవుడి రంగు జ్యోతి ప్రజ్వలన చేస్తూ అంగారకుని గౌరవించడంలో మాత్రం మార్పు రాలేదు. నుదుట బొట్టు పెట్టుకునే ప్రాంతాన్ని జ్ఞాననేత్రం లేక మనోనేత్రం అంటారు.
Also Read:కువైట్ లో భారత ఉత్పత్తుల అమ్మకాలు బంద్