తెలుగు జానపదాన్ని ఏర్చికూర్చి తయారు చేసిన పాట నాటు నాటు. ఈ పాటకు హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు యువతరాన్నే కాకుండా వృద్ధులకు కూడా ప్రేరణగా నిలిచింది. భాష, ప్రాంతం, దేశం అనే తేడా లేకుండా ప్రజల్ని ఆకట్టుకుంది.
కేవలం ప్రేక్షకుల మన్నల్నే కాకుండా ప్రపంచస్థాయిలో అవార్డులను గెలుచుకొన్నది. అయితే ఆస్కార్ వేదిక మీద ఈ పాటపై ఎన్టీఆర్, రాంచరణ్ ఎందుకు డ్యాన్స్ చేయలేదని అభిమానుల్లో ఓ ప్రశ్న తలెత్తింది.
అయితే ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రాంచరణ్ ఎందుకు డ్యాన్స్ చేయలేదంటే? ప్రేమ్ రక్షిత్, రాజమౌళి విజన్ నాటు నాటు పాట విషయానికి వస్తే.. ఆ పాటను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విజన్ కారణం.
ఆ పాటను డిజైన్ చేసిన విధానమే పక్కాగా ఉంది. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరు నెల రోజులపాటు రిహార్సల్ చేసి స్టెప్పులను పర్ఫెక్ట్ గా వేయడంతోనే ఆ పాట అంత జనరంజకంగా మారింది.
ఇక కోవిడ్ పరిస్థితులు వెంటాడుతుండగా.. రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో కూడా నాటు నాటు పాట విషయంలో దర్శకుడు రాజమౌళి రాజీ పడలేదు. ప్రత్యేక విమానంలో ఉక్రెయిన్‌కు వెళ్లి.. టీమ్‌తో నాటు నాటు పాటను 17 రోజులపాటు చిత్రీకరించాడు. తాను అనుకొన్న విధంగా వచ్చేంత వరకు రాజమౌళి పాటను చిత్రీకరిస్తూనే ఉన్నారు.