లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయ్స్ గురించి అందరికీ తెలిసిందే. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లను తయారు చేసి కస్టమర్లకు అందిస్తుంది. కస్టమర్లు కోరుకున్న విధంగా కార్లను రూపొందించి అందజేయడంలో రోల్స్ రాయ్స్ పేరుగాంచింది. అందుకనే ఆ కంపెనీకి చెందిన కార్ల ధరలు ప్రారంభంలోనే రూ.కోట్లు పలుకుతాయి. అయితే నిజానికి ఆ కార్లు ఎందుకంత ప్రత్యేకం ? అంత ఎక్కువ ధరలను అవి ఎందుకు కలిగి ఉంటాయి ? అంటే..
రోల్స్ రాయ్స్ కంపెనీ కస్టమర్లు కోరుకున్న విధంగా కార్లను వారి అభిరుచి మేరకు డిజైన్ చేసి తయారు చేస్తుంది. అందుకనే సహజంగానే ఆ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇక కార్ల తయారీకి వాడే మెటీరియల్‌కు గాను రోల్స్ రాయ్స్ అసలు రాజీ పడదు. అత్యంత నాణ్యవంతమైన మెటీరియల్‌తో కార్లను తయారు చేస్తుంది. ఉదాహరణకు వాటి టైర్లను తీసుకుంటే కారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టైర్ల ద్వారా వచ్చే సౌండ్‌ను తగ్గించడానికి రోల్స్ రాయ్స్ ప్రత్యేకమైన ఫోం ఫిల్డ్ టైర్లను ఉపయోగిస్తుంది. దీంతో టైర్ల నుంచి కేవలం 9 డెసిబుల్స్ అంతకన్నా తక్కువ శబ్దం మాత్రమే వస్తుంది. అందుకనే ఆ కంపెనీ అంత ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
కారులో ప్రతి పార్ట్ తయారీలో రోల్స్ రాయ్స్ అత్యంత శ్రద్ధ వహిస్తుంది. అంతేకాదు, ప్రతి పార్ట్‌ను నాణ్యమైన మెటీరియల్‌తో తయారు చేస్తుంది. అందుకనే ఆ కార్ ధరలు ఎక్కువగా ఉంటాయి. రోల్స్ రాయ్స్ కార్లలో కూర్చుని ప్రయాణం చేసే వారికి బయటి శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు గాను వాటిల్లో 136 కిలోల మెటీరియల్‌తో అకౌస్టిక్ ఇన్సులేషన్ చేస్తారు. క్యాబిన్ మొత్తం ఇన్సులేషన్ అవుతుంది. దీని వల్ల బయటి నుంచి శబ్దాలు అస్సలు వినిపించవు. ఇదనే కాదు.. ఆ కార్లలో ఏ పార్ట్‌ను తీసుకున్నా ఇలాంటివే ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి.
రోల్స్ రాయ్స్ కార్లను డిజైన్ చేసేందుకు ప్రముఖ ఆర్టిస్ట్‌ల సహాయం కూడా తీసుకుంటారు. అందువల్ల ఆ కార్ల లుక్ బాగుంటుంది. కార్ల లోపలిభాగంలో పైన కప్పు సీలింగ్‌ను నక్షత్రాల రూపంలో కనిపించేలా కూడా కస్టమర్లు కార్లను ఆర్డర్ చేయవచ్చు. లేదా తమకు నచ్చిన ఎంబ్రాయిడరీ డిజైన్‌ను కప్పు సీలింగ్‌కు అమర్చుకోవచ్చు. ఇలా కార్లను ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మార్చుకోవచ్చు. అందువల్లే రోల్స్ రాయ్స్ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. కస్టమర్లకు కార్లను వాడుతుంటే ప్రతి పార్ట్‌లోనూ విలాసవంతమైన, అత్యంత సౌకర్యవంతమైన ఫీలింగ్ కలుగుతుంది. దాని కోసమే రోల్స్ రాయ్స్ కృషి చేస్తుంది. కనుక ఆ కార్ల ధరలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి.