మన దేశంలో కొన్ని వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాటికి భయపడటమో లేదా వాటిని గౌరవించడమో ఏదొకటి జరుగుతూ ఉంటుంది. అలాంటి వస్తువులలో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు విషయంలో చాలా మందికి చాలా భయాలు ఉన్నాయి. చేతికి ఇవ్వకూడదు అని కొందరు చెప్తే అప్పు ఇవ్వకూడదు అని మరికొందరు అంటూ ఉంటారు.
Also Read:భారీ వానలతో నీటమునిగిన జనగామ ఆర్టీఏ ఆఫీస్
ఇక ఉప్పుని అమ్మడం మంచిది కాదని కొందరు అంటారు. ఉప్పు దొంగతనం చేస్తే దరిద్రం అంటారు ఇంకొందరు. అలాగే షాప్స్ బయట ఉప్పుని ఎందుకు పెడతారో చాలా మందికి తెలియదు. దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఒకసారి చూద్దాం. ఉప్పు, నూనెలు , పెసలు , నవధాన్యాలు వెనకటి రోజులలో వ్యాపారులు అందరూ తమ షాప్స్ లో అమ్మే వాళ్ళు కాదు. ఉప్పు, అన్నం కూడా అమ్మడం అనేది మంచిది కాదు.
అవి ఉచితంగా ఇవ్వడం ధర్మం అని అప్పట్లో భావించే వాళ్ళు. ఇక పెసలు అపర కర్మ లలో వాడేది అని షాప్ లో అమ్మే వస్తువుగా పెట్టరు. ఇక నవధాన్యాలు, బెల్లం, ఉప్పు ప్రధానంగా దోష పరిహారార్థం దానం ఇచ్చేవి అని నమ్మకం. నునె , నువ్వులు శని సంబంధంగా చెప్పేవి కాబట్టి వాటిని కూడా అమ్మరు. సంప్రదాయం పాటించేవారు తమ పూర్వీకులు ఏ వస్తువులతో వ్యాపారం చేసేవారో అవే చేస్తున్నారు. ఇనుము, కొందరు ఇత్తడి, కొందరు బంగారు, కొందరు పప్పులు ,కొందరు అలంకార సామగ్రి అమ్మరు. ఉప్పు నీళ్ళుగా కారిపోయేది కాబట్టి… అమ్మకూడదు అని భావించి బయట పెడతారు. కట్టెలు గూడా దహన క్రియలకు ఉపయోగించేవి గాబట్టి అందరూ ఆ వ్యాపారం చేయడానికి ఇష్టపడరు.